Read more!

English | Telugu

ఎన్టీఆర్ కు అభిమానులు అవసరం లేదా?

 

రాష్ట్రంలో సూర్యుడి వేడి ఎంత ఎక్కువగా ఉందో తెలియదు కానీ... ఈసారి మాత్రం ఎన్నికల వేడి దద్దరిల్లిపోతుంది. రాజకీయనాయకులే కాకుండా సినీ తారలు కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవలే పవన్ కొత్త పార్టీ పెట్టి హాల్ చల్ చేసాడు. మహేష్ తన బావకు మద్దతు పలికాడు. రాజమౌళి లోక్ సత్తా పార్టీకి మద్దతు ఇచ్చాడు. ఇలా ప్రతి ఒక్కరు తమకు సంబంధంలేని రాజకీయ పార్టీలపై శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన సొంత పార్టీ గురించి పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోయాడు.

ఎన్నికల ప్రచారంలో ప్రతిఒక్కరూ కూడా తమ పార్టీనే గెలిపించండి అంటూ ప్రచారం చేస్తుంటారు. కానీ తన తాతయ్య స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయకుండా సైలెంట్ అయ్యాడు.

ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన "బృందావనం" చిత్రం తరవాత సరైన విజయాలు లేని ఎన్టీఆర్ ఇలా పార్టీ అభిమానులకు దూరంగా ఉంటే, దాదాపు తన అభిమానులకు దూరంగా ఉన్నట్లేనని తెలుస్తుంది. అసలే "రభస" చిత్రంపై ఎన్టీఆర్ ఆశలు వదిలేసుకున్నాడు. ఎందుకంటే ఆ చిత్ర దర్శకుడి అనారోగ్యం కారణంగా సినిమాను అసిస్టెంట్ డైరెక్టర్లతో కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించారు. కాబట్టి ఈ సినిమా కనీసం యావరేజ్ గా అయినా ఆడాలంటే అభిమానులు ఉండాల్సిందే. కానీ ఎన్టీఆర్ మాత్రం "తనను పార్టీ తరపున ఎవరు పిలవలేదు" అంటూ బుంగమూతి పెట్టుకొని కూర్చున్నాడు. అయిన సొంత పార్టీలో ప్రచారం కోసం ఎవరైనా బొట్టు పెట్టి మరి పిలుస్తారా ఏంటి? అవసరం వచ్చినప్పుడు ఎవరు పిలవకపోయినా వెళ్ళాల్సిందే.

మరి ఎన్టీఆర్ తన పార్టీ కోసం కాకపోయినా తన సినిమాల కోసమైనా అభిమానులను కలిస్తే బాగుంటుంది. నిజానికి సినిమాల కోసమే అభిమానుల వద్దకు వెళ్తే "తమ అభిమాన హీరో తమకోసం వచ్చాడంటూ.." ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటారు. కానీ ఈ ఎన్నికల సమయంలో వెళ్తే అటు అభిమానులతో పాటు ఇటు మాములు ప్రేక్షకులు సైతం ఆనందపడతారు. మరి ఇప్పటికైనా ఎన్టీఆర్ ఎవరి పిలుపు కోసం ఎదురుచూడకుండా జనంలోకి వెళ్లి పార్టీ తరపున ఒకసారి ప్రచారం చేస్తే పార్టీ గెలుపు తెలియదు కానీ "రభస" సినిమా మాత్రం విజయం ఖరారు.