Read more!

English | Telugu

ఫొటో స్టోరీ: చంద్ర‌మోహ‌న్ డైలీ ప్రోగ్రాంను బ్లాక్ బోర్డు మీద రాస్తున్న కుమార్తె!

 

సాధార‌ణంగా సినిమావాళ్ల‌కు ప్ర‌తి నెలా సెకండ్ సండే హాలిడే. ఆ రోజు షూటింగ్స్ పెట్ట‌రు. అలాంట‌ప్పుడు పేకాట‌, ఫ్రెండ్స్‌తో డ్రింక్స్‌తో కాల‌క్షేపం చెయ్య‌డం వెట‌ర‌న్ యాక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్‌కు ఇష్టం ఉండేది కాదు. మ‌నం మాట్లాడుకుంటోంది 1980ల‌లో ఫిల్మ్‌ ఇండ‌స్ట్రీ మ‌ద్రాసులో ఉన్న‌ప్ప‌టి మాట‌. షూటింగ్‌కు హాలిడే వ‌చ్చిందంటే చంద్ర‌మోహ‌న్ త‌న ఇద్ద‌రు కూతుళ్లు.. మ‌ధుర‌మీనాక్షి, బాల‌మాధ‌వితో ఆడుకుంటూ ఉండేవారు. క్యార‌మ్స్‌, ష‌టిల్ బ్యాడ్మింట‌న్ లాంటి వాటితో పాటు మెద‌డుకు మేత‌పెట్టే చెస్ అంటే ఆయ‌న‌కు బాగా ఇష్టం. పిల్ల‌లు చెస్ ఆడుకుంటుంటే, చంద్ర‌మోహ‌న్‌, ఆయ‌న భార్య జ‌లంధ‌ర ఆడియెన్స్ అవ‌డం కూడా క‌ద్దు. 

Also read:  "స‌గం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాట‌ల‌కు స్ట‌న్న‌యిన ల‌క్ష్మి!

ఇక ఫొటో విష‌యానికి వ‌స్తే.. బ్లాక్ బోర్డ్ మీద చిన్న‌మ్మాయి బాల‌మాధ‌వి ఏదో రాస్తుంటే, చంద్ర‌మోహ‌న్ ఏదో చెప్తున్నారు. దాని క‌థేమిటంటే ఆయ‌న‌ను చూడ్డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎవ‌రో ఒక‌రు వ‌స్తుండ‌టం, లేక‌పోతే ఏదో కంపెనీ వాళ్లు కాల్షీట్ అడ్జెస్ట్‌మెంట్ కోసం రావ‌డం, ఇంట్లోవాళ్ల స‌మాధానం ఆ వ‌చ్చిన‌వాళ్ల‌కు సంతృప్తి క‌లిగించ‌క‌పోవ‌డం అప్పుడ‌ప్పుడు జ‌రుగుతుండేది. ఆ గొడ‌వేం లేకుండా ఏ రోజు ప్రోగ్రాం ఆరోజు అలా బోర్డు మీద రాసి పెట్టుకుంటారు చంద్ర‌మోహ‌న్‌. ఆయ‌న ప‌ని హ‌డావిడిలో ఉంటే, బాల‌మాధ‌వి ఆ ప‌ని చేస్తుంది. ఆ ఫొటో అలాంటి సంద‌ర్భంలోనిదే. త‌ను స‌వ్యంగా రాసిందా, లేదా అని చూసి ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చేవారు చంద్ర‌మోహ‌న్‌. ఆ ప‌ద్ధ‌తి అప్ప‌టికీ ఇప్ప‌టికీ మిగ‌తా ఏ న‌టీన‌టుల ఇంటి ద‌గ్గ‌రా క‌నిపించ‌దు.

Also read:  సినిమాలో కొడుక్కి కొరివి పెట్టడాన్ని త‌ప్పించుకున్నారు కానీ..!

ఇక‌పోతే, మ‌ద్రాసులో ఉన్న‌ప్పుడు ఇంకో సుఖం కూడా ఉండేది. షూటింగ్స్ లేన‌ప్పుడూ, సెకండ్ సండే స‌ర‌దాగా బ‌స్సుల్లోనూ, సైకిల్ మీదా ద‌గ్గ‌ర్లోని ఊళ్లు తిరుగుతుండేవారు చంద్ర‌మోహ‌న్‌. ఎక్స‌ర్‌సైజ్‌లా ఉంటుంద‌ని ఆయ‌న సైకిల్ మీద వెళ్లి చిన్న చిన్న ప‌నులు చ‌క్క‌బెట్టుకొని వ‌చ్చేవారు. హాలిడే నాడు త‌న అభిమానుల నుంచి వ‌చ్చిన ఉత్త‌రాలు చ‌దివి, స్వ‌యంగా స‌మాధానాలు రాయ‌డం ఆయ‌న‌కు గొప్ప కాల‌క్షేపం.