"సగం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాటలకు స్టన్నయిన లక్ష్మి!
on Dec 3, 2021
విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు సరసన నాయికగా 'ఒకే కుటుంబం'లో తొలిసారి నటించారు లక్ష్మి. ఆ తర్వాత 'బంగారు మనిషి' సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో జరిగిన సంఘటన ఇప్పటికీ లక్ష్మికి బాగా గుర్తు. ఎన్టీఆర్‌కు సాయంత్రం ఉపాహారం ఇంటినుంచి వస్తుంది. రెండు పోళీలు, రెండు దోసెలు, హల్వా, రెండు యాపిల్ జ్యూస్ సీసాలు, కారప్పూస వగైరా ఉంటాయి. ఇదీ ఆయన ఫలహారం. లక్ష్మి సగం దోసె తిని లేచి వెళ్లిపోతూ ఉంటే, "ఏవండీ లక్ష్మిగారూ! ఇటు రండి" అని పిలిచారు రామారావు.
ఆయన ఎప్పుడూ చిన్నవారినైనా, పెద్దవారినైనా "అండీ" అని సగౌరవంగా మాట్లాడతారే తప్ప, ఏకవచన ప్రయోగం చేయరు. అంత మర్యాద ఇస్తారు. ఆయన అలా మర్యాద ఇస్తున్నప్పుడు ఎదుటివాళ్లకు ఒకరకమైన భయం, గౌరవం ఏర్పడి ఠక్కున లేచి నిల్చుంటారు.
Also read: ఎన్టీఆర్‌తో నటించడానికి మూడు నెలల ముందే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన రాధ!
ఆయనలా పిలిచేసరికి లక్ష్మి ఆయన దగ్గరకు వెళ్లారు. "ఏం తిన్నా జీర్ణించుకునే వయసు మీది. అలాంటి వయసులో మీరు అర్ధ దోసె తింటారా? సిగ్గు లేదూ మీకు?" అన్నారు. "ఏమిటండీ.. మర్యాదగా పిలిచి మరీ తిడుతున్నారు" అన్నారు లక్ష్మి, నవ్వుతూ.
Also read: సింగపూర్ వ్యక్తితో 'శంకరాభరణం' రాజ్యలక్ష్మి పెళ్లి ఎలా కుదిరిందో మీకు తెలుసా?
"లేకపోతే ఏమిటండీ! చిన్నపిల్లలు మీరు. బాగా తినాలి. ఉదయాన్నే లేచి వ్యాయామం చెయ్యాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్ద హీరోయిన్‌గా ఈ సినీ పరిశ్రమలో గొప్ప పేరు తెచ్చుకోవాలి" అని బుద్ధులు చెప్పారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
