Read more!

English | Telugu

మారుతి గేట్లు ఓపెన్ చేస్తే ఆ క్యారెక్టర్లు పుట్టాయి!

 

డైరెక్ట‌ర్ మారుతి ప్ర‌తి సినిమాలో ఏదో ఒక క్యారెక్ట‌ర్ బాగా పండుతుంది. ఆ క్యారెక్ట‌ర్ సినిమాకు లైఫ్‌నిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌తిరోజూ పండ‌గే సినిమా తీసుకుంటే సాయిధ‌ర‌మ్ తేజ్ తండ్రిగా, స‌త్య‌రాజ్ కొడుకుగా రావు ర‌మేశ్ చేసిన క్యారెక్ట‌ర్‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఆ క్యారెక్ట‌ర్‌ను ఆడియెన్స్ విప‌రీతంగా ఎంజాయ్ చేశారు. చక్కని టైమింగ్‌తో ఆయన చెప్పిన డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఆ క్యారెక్టర్‌ను ఒక ప్రత్యేక శ్రద్ధతో డైరెక్టర్ మారుతి డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇదే విషయాన్నిమారుతిని అడిగితే, తను రాసుకున్న క్యారెక్టర్‌ను రావు రమేశ్ తన నటనతో మరో స్థాయికి తీసుకువెళ్లారని చెప్పాడు. 

'ప్రతిరోజూ పండగే' కథలో హీరో ఫాదర్‌గా రావు రమేశ్‌నే ఊహించుకున్నాడు మారుతి. కొత్తగా ఒక కంపెనీ పెట్టుకొన్న ఒక ఎన్నారై పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడనే దానిపై ఆ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడు. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు, "ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తున్నారు, మరి హీరో గారికి ఓకేనా?" అని మారుతిని రావు రమేశ్ అడిగారు. "హీరోకీ, నిర్మాతలకీ చెప్పిన తర్వాతే మీకొచ్చి చెప్పానండీ" అని తెలిపాడు మారుతి. "క్యారెక్టర్ చాలా బాగుందండీ. నేను చేస్తానండీ" అన్నారాయన. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 28 రోజులు కాల్షీట్లు ఇచ్చారు. ఇన్ని రోజులు ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కాల్షీట్లు ఇవ్వడం అరుదుగా మాత్రమే జరుగుతుంది. "అన్ని రోజులూ సెట్స్‌పై మాకొక పండగ లాగే గడిచింది. కొంత మంది బాడీ లాంగ్వేజ్ చూసి నేను ఎగ్జైట్ అవుతుంటాను. నేను రాసుకొనేటప్పుడు క్యారెక్టర్ బిహేవియర్ సగమే ఉంటుంది. సెట్‌కు వెళ్లాక అది ఎన్‌హాన్స్ అవుతుంది. వాళ్ల పర్ఫార్మెన్స్ చూశాక ఎగ్జైట్ అవుతుంటాను" అని చెప్పాడు మారుతి.

Also read:  ఎమ్మెస్ చనిపోయే ముందు బ్రహ్మానందాన్ని చూడాలన్నారు!

ఇలా ఒక క్యారెక్టర్‌ను తాను రాసుకున్న దానికంటే మించి తెరపై చూపించిన సందర్భాలు ఆయనకు ఇదివరకూ సంభవించాయి. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది 'ప్రేమ కథాచిత్రం'లోని సప్తగిరి క్యారెక్టర్. అందులో హీరో సుధీర్‌బాబు ఫ్రెండ్ గిరి క్యారెక్టర్‌లో సప్తగిరి తాను భయపడుతూ మనకు ఎంతగా నవ్వులు పంచాడో తెలిసిందే. దెయ్యం పట్టిన హీరోయిన్ చేత తన్నులు తింటూ, భయపడుతూ అతడు చేసే యాక్టింగ్ కానీ, చెప్పే డైలాగ్స్ కానీ నవ్వులు పూయించాయి. ఆ సినిమా తర్వాత సప్తగిరి టాప్ కమెడియన్ల లిస్టులో జాయినైపోయాడు. 

Also read:  'అన్‏స్టాపబుల్'లో ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై స్పందించిన బాలయ్య!

నిజానికి 'ప్రేమ కథాచిత్రం'లో సప్తగిరిది మొదట పెద్ద క్యారెక్టర్ అనుకోలేదు మారుతి. ఆ క్యారెక్టర్ గురించి మారుతి చెబుతూ "అతడిని పిలిస్తే వచ్చాడు. రెండు డైలాగులు చెప్పాక అతని టైమింగ్ నేననుకున్న దానికి వేరే లెవల్లో ఉందనిపించింది. అలాంటోడ్ని దెయ్యం కొడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో మాగ్జిమం అతడి చేత కామెడీ చేయించాను. అతని క్యారెక్టర్‌కు లిమిటేషన్స్ ఉండవు" అని తెలిపాడు మారుతి. అలా గేట్లు ఓపెన్ చెయ్యడంతో రెచ్చిపోయి ఆ క్యారెక్టర్‌ను బ్రహ్మాండంగా పండించాడు సప్తగిరి.

Also read:  'పుష్ప' విల‌న్ ఎవ‌రి కొడుకో తెలుసా? అత‌ని తండ్రి నాగార్జునను డైరెక్ట్ చేశాడు!

మారుతి డైరెక్ట్ చేయగా సూపర్ హిట్టయిన 'భలే భలే మగాడివోయ్' మూవీలో నాని క్యారెక్టర్‌కు కూడా లిమిటేషన్స్ కనిపించవు. అందులో హీరో నాని దేన్నయినా మర్చిపోతుంటాడు. అయినా అన్ని ఎమోషన్స్  ఆ క్యారెక్టర్‌లో కనిపిస్తాయి. ఒక మంచి క్యారెక్టర్‌కు ఒక మంచి ఆర్టిస్టు దొరికితే, ప్లే చెయ్యడానికి ఎక్కువ స్కోపు దొరుకుతుందని చెప్పడానికి నాని చేసిన లక్కీ క్యారెక్టర్ ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఆ క్యారెక్టర్‌లో నాని చాలా ముఖ్యమైన విషయాల్ని మర్చిపోతుండటం వల్ల కలిగే సమస్యలు, ప్రమాదాలు చూస్తూ మనం భావోద్వేగాలకు గురవుతుంటాం. అతడికున్న డిజార్డర్‌కు మనలో సానుభూతి కలుగుతుంది. ఆ తర్వాత ఆ సమస్య నుంచి అతడు బయటపడే విధం చూసి, హాయిగా ఊపిరి పీల్చుకుంటాం.

Also read:  అమ్మ మంద‌లించింద‌ని తుంట‌రిప‌ని చేసి చిన్న‌ప్పుడే ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు!

అలాగే 'మహానుభావుడు'లో ఓసీడీ అనే డిజార్డర్ ఉన్నసాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆనంద్ క్యారెక్టర్‌కు లిమిటేషన్స్ కనిపించవు. అతనిలోని క్లీన్‌లీనెస్‌ను పీక్‌లో చూపించాడు మారుతి. ఆ క్యారెక్టర్‌లో శర్వానంద్ చెలరేగిపోయి చేశాడు. "ప్రేక్షకుడిని నేను ఏ కోణంలో చూస్తున్నానో, ఆ కోణంలోనే ఆ క్యారెక్టర్‌ను ఫాలో అవమని చెప్తుంటా" అని ఆ పాత్రలు అంతపేరు తెచ్చుకోవడంలోని రహస్యాన్ని తెలిపాడు మారుతి.