Read more!

English | Telugu

శార‌ద ఒక సీన్ చేయ‌డానికి 20 టేకులు తీసుకున్నారంటే స‌ర్‌ప్రైజ్ అవ్వాల్సిందే!

 

జాతీయ ఉత్త‌మ‌న‌టిగా మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న శార‌ద ఒక సినిమాలో ఒక సీన్ చేయ‌డానికి 20 టేకులు తీసుకున్నారంటే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. ఆమె న‌ట జీవితంలో ఒకే ఒక సినిమాకు ఇలాంటి సంద‌ర్భం త‌ట‌స్థించింది. ఆ సినిమా టైటిల్ కూడా 'శార‌ద' కావ‌డం ఒక విశేషం. ఆ సినిమాకు ద‌ర్శ‌కుడు క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్‌. ఇందులో శార‌ద భ‌ర్త‌గా, డాక్ట‌ర్‌గా శోభ‌న్‌బాబు ద్విపాత్ర‌భిన‌యం చేశారు.

శార‌ద 20 టేకులు తీసుకున్న ఆ సీన్ ఏమిటంటే.. క‌థ ప్ర‌కారం శార‌ద‌కు మ‌తిస్థిమితం త‌ప్పుతుంది. ఆమె అన్న ప‌ట్నంవెళ్లి డాక్ట‌ర్‌తో మాట్లాడి, "నా చెల్లెలిని హాస్పిట‌ల్‌కు తీసుకుర‌మ్మంటే తీసుకువ‌స్తాను" అని చెప్తాడు. దానికి ఆ డాక్ట‌ర్, "మీరున్న చోటికే నేను వ‌స్తాను" అని, శార‌ద ఉంటున్న ఊరికి వ‌చ్చి, ఆమె ఇంటిలో అడుగుపెట్టిన‌ప్పుడు అత‌న్ని చూసిన శార‌ద త‌న భ‌ర్తేన‌ని భావిస్తుంది. 

Also read:  "స‌గం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాట‌ల‌కు స్ట‌న్న‌యిన ల‌క్ష్మి!

ఆ సంద‌ర్భంలో అత‌ని కాళ్ల‌మీద ప‌డి, "న‌న్నెందుకిలా చేశారు, నేనేం త‌ప్పుచేశాన‌ని మీరు న‌న్ను వ‌దిలి వెళ్లిపోయారు. ఏదో నావ‌ల్ల త‌ప్పు జ‌రిగినా, న‌న్ను తిట్టొచ్చుక‌దండీ".. అని భోరున విల‌పిస్తుంది.

Also read:  ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీ రేఖ గురించి మీకు తెలీని ఏడు విష‌యాలు!

ఈ సీన్‌ను ఇర‌వై సార్లు తీశారు విశ్వ‌నాథ్‌. ప్ర‌తిసారీ ఆయ‌న శార‌ద‌తో, "మీ నుంచి ఇంకా ఏదో ఎక్స్‌ప్రెష‌న్ వ‌స్తోంది. నేను ఎదురుచూస్తున్న ఎక్స్‌ప్రెష‌న్ రావ‌డం లేదు" అని అనేవారు త‌ప్ప‌, "నువ్వు బాగా చెయ్య‌డం లేదు" అని మాత్రం అన‌లేదు. అది ఆయ‌న త‌త్వం. న‌టీన‌టుల‌తో చాలా ప్రోత్సాహ‌క‌రంగా మాట్లాడుతూ, త‌న‌కు కావాల్సిన ఎక్స్‌ప్రెష‌న్ వ‌చ్చేవ‌ర‌కూ వ‌దిలేవారు కాదు. ఏమాత్రం విసుగులేకుండా, ఎంతో స‌హ‌నంగా, ఆర్టిస్టుని నిరుత్సాహ‌ప‌ర్చ‌కుండా, త‌న‌కు కావాల్సిన విధంగా న‌ట‌న‌ను రాబ‌ట్టుకునేవారు. 

Also read:  ముచ్చ‌ర్ల అరుణ పెళ్లి ఎవ‌రితో, ఎలా జ‌రిగిందో తెలుసా?

20 టేకులైన త‌ర్వాత‌, ఆఖ‌రి టేక్‌ను ఓకే చేసి, అప్పుడు చెప్పారు - "ఇదీ నాకు కావాల్సిన ఎక్స్‌ప్రెష‌న్" అని. శార‌ద న‌ట జీవితంలో 20 టేకులు తీసుకున్న మొద‌టి చిత్రం, చివ‌రి చిత్రం 'శార‌ద‌'.