Read more!

English | Telugu

'జై ప‌వ‌ర్‌స్టార్' అని అన‌లేక‌పోయిన బ‌న్నీ 'జై బాల‌య్య' అని ఎలా అన‌గ‌లిగాడు?

 

బాల‌కృష్ణ 'అఖండ' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ స్పీచ్ ఇప్పుడు వివాదాన్ని రేకెత్తించింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అత‌నిపై గ‌ర‌మ్ గ‌ర‌మ్‌గా చ‌ర్చించుకుంటున్నారు. 'అఖండ' ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అవ‌డ‌మే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తే.. త‌న స్పీచ్‌లో బాల‌య్య‌ను బ‌న్నీ పొగిడిన తీరు మ‌రింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఇక త‌న స్పీచ్‌ను అత‌ను "జై బాల‌య్య" అని ముగించ‌డం బాల‌కృష్ణ ఫ్యాన్స్‌ను ఆనంద‌డోలిక‌ల్లో ముంచెత్త‌గా, మెగా ఫ్యాన్స్‌కు మాత్రం షాక్‌నిచ్చింది.

కొంత కాలంగా మెగా క్యాంప్ నుంచి బ‌య‌ట‌కొచ్చి 'అల్లు ఆర్మీ'ని త‌యారుచేసుకున్న బ‌న్నీపై మెగా ఫ్యాన్స్ గుర్రుమంటూనే ఉన్నారు. ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర వేయ‌డంతో పాటు ఇమేజ్ ప‌రంగా టాప్‌లో ఉండ‌టానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు బ‌న్నీ. గ‌తంలో ఒక‌సారి ఒక ఈవెంట్‌లో బ‌న్నీ మాట్లాడుతున్న‌ప్పుడు 'జై ప‌వ‌ర్‌స్టార్' అనాల్సిందిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ గ‌ట్టిగా అర‌వ‌డం, 'చెప్ప‌ను బ్ర‌ద‌ర్' అని బ‌న్నీ అన‌డం వార్త‌ల్లో నిలిచింది. అప్ప‌ట్నుంచీ మెగా ఫ్యాన్స్‌.. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ బ‌న్నీ మీద గుస్సా అవుతున్నారు. 

అలాంటిది ఇప్పుడు 'అఖండ' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో "జై బాల‌య్య" అని బ‌న్నీ నినాదాన్నివ్వ‌డం ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌ను మ‌రింత ఆగ్ర‌హానికి గురిచేసింద‌ని అంటున్నారు. త‌న ప్ర‌సంగం చివ‌ర‌లో "మీ అంద‌రి ప్రేమ‌, మీ అంద‌రి అభిమానం కోసం జై బాల‌య్య‌!" అంటూ చేయెత్తి చెప్పాడు బ‌న్నీ. అలాగే బాల‌య్య డైలాగ్ డిక్ష‌న్ గురించి విప‌రీతంగా పొగిడేశాడు అర్జున్‌. "ఎన్టీఆర్ గారి త‌ర్వాత బాల‌కృష్ణ‌గారు అంతే అద్భుతంగా డైలాగ్స్ చెప్ప‌గ‌లుగుతారు. ఇందులో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు." అని అత‌ను చెప్పాడు.

Also read:  "మీ అంద‌రి ప్రేమ‌, అభిమానం కోసం జై బాల‌య్య‌!" అల్లు అర్జున్ నినాదం!!

అంతేనా.. "సెకండ్ లాక్‌డౌన్ త‌ర్వాత ఫ‌స్ట్ వ‌స్తోన్న పెద్ద సినిమా 'అఖండ‌'. ఇదొక అఖండ జ్యోతిలాగా మొత్తం సినిమా ప‌రిశ్ర‌మకే వెలుగునివ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ప్ర‌తి ఒక్క‌ళ్లం కోరుకుంటున్నాం. ఈ ఉత్సాహంతో జ‌నాలను అలా థియేట‌ర్ల‌కు ర‌ప్పించి, ఇదే ఉత్సాహాన్ని ఇంకో రెండు వారాల త‌ర్వాత 'పుష్ప' సినిమాతో మ‌రింత ఉత్సాహప‌ర్చి, అంతే ఉత్సాహంతో మ‌రో రెండు మూడు వారాల త‌ర్వాత వ‌స్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు వ‌చ్చి, అంతే ఉత్సాహంతో ఆ త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌కు వ‌చ్చి, చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల‌నూ గెలిపించాల‌ని కోరుకుంటున్నాను." అన్నాడు బ‌న్నీ.

'అఖండ‌'తో పాటు త‌న సినిమా 'పుష్ప‌', ఆ త‌ర్వాత వ‌చ్చే రాజ‌మౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమాల గురించి ప్ర‌స్తావించిన బ‌న్నీ, ఫిబ్ర‌వ‌రి 4న వ‌స్తున్న 'ఆచార్య' పేరును ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంపై కూడా మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. త‌న‌దైన ఎరాను సృష్టించాల‌నే ల‌క్ష్యంతోనే బ‌న్నీ ముందుకు వెళ్తున్నాడ‌ని కొన్ని సంవ‌త్స‌రాలుగా అత‌డి క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులు అంటున్నారు.