ENGLISH | TELUGU  

"మీ అంద‌రి ప్రేమ‌, అభిమానం కోసం జై బాల‌య్య‌!" అల్లు అర్జున్ నినాదం!!

on Nov 27, 2021

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "జై బాల‌య్య" అని నినాదం చేశారు. ఈ అరుదైన సంద‌ర్భం' అఖండ' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చోటు చేసుకుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్ చేయ‌గా, బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన 'అఖండ' మూవీ డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. శ‌నివారం రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. బాల‌కృష్ణ సినిమా వేడుక‌కు బ‌న్నీగెస్ట్‌గా రావ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్‌. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న బాల‌య్యను ప్ర‌శంసిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. బాల‌య్య త‌న‌కు తండ్రిలాంటివార‌ని ఆయ‌న అన్నారు.

"ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నంద‌మూరి ఫ్యామిలీకి, మా అల్లు ఫ్యామిలీకి ఉన్న క‌నెక్ష‌న్ ఇప్ప‌టిది కాదు. ఎన్టీ రామారావు గారు, మా తాత‌య్య అల్లు రామ‌లింగ‌య్య‌గారి కాలం నుంచి ఉన్న అనుబంధం ఇది. ఈనాటి అనుబంధం ఏనాటిదో! మా తాత‌య్య‌గారికి రామారావు గారంటే ఎంతిష్టం, ఎంత చ‌నువంటే.. వాళ్లింట్లో నేరుగా వంటింట్లోకి వెళ్లిపోయేంత‌! అల్లు రామ‌లింగ‌య్య‌గారు బాల‌కృష్ణ‌గారితో ఎన్నో సినిమాల్లో చేశారు. బాల‌య్య‌గారు, మా నాన్న‌గారు ఒకే జ‌న‌రేష‌న్ నుంచి స్టార్ట్ చేసిన వ్య‌క్తులు. చిరంజీవిగారు, బాల‌కృష్ణ‌గారి సినిమాలు చూస్తూ పెరిగిన జ‌న‌రేష‌న్ మాది. అలాంటి నేను ఈరోజు బాల‌కృష్ణ‌గారి ఫంక్ష‌న్‌కు రావ‌డం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాకిది వెరీ స్వీట్ మూమెంట్‌. ఎందుకంటే వ‌య‌సులో కాక‌పోయినా, సీనియారిటీలో నాకు ఫాద‌ర్ ఫిగ‌ర్ లాంటి ఆయ‌న ఫంక్ష‌న్‌కు రావ‌డం మ‌న‌స్ఫూర్తిగా నిజంగా ఆనందంగా ఫీల‌వుతున్నాను." అన్నారు అల్లు అర్జున్‌.

"బాల‌కృష్ణ‌గారు ఈ లెవ‌ల్లో ఉన్నారంటే దానికి రెండు కార‌ణాలు. ఒక‌టి- సినిమాపై ఆయ‌న‌కున్న ఎడిక్ష‌న్‌, రెండు- సినిమాలో ఆయ‌న డిక్ష‌న్‌. ఆయ‌న డైలాగ్ చెప్పిన‌ట్లు ఇంకెవ‌రూ చెప్ప‌లేరు. ఒక యాక్ట‌ర్‌గా, ఒక ఆర్టిస్టుగా నేనెంతో ఇష్ట‌ప‌డే విష‌య‌మేంటంటే.. ఎవ‌రైనా ఒక‌పేజీ డైలాగ్ చెప్ప‌గ‌ల‌రు కానీ, రెండు పేజీలైనా, మూడు పేజీలైనా బిగినింగ్‌లో ఎంత ఇంటెన్సిటీతో చెప్తారో చివ‌రిదాకా అదే ఇంటెన్సిటీతో క‌న్విన్సింగ్‌తో డైలాగ్ చెప్తారు. అది గ్రేట్‌నెస్‌. అది బాల‌కృష్ణ‌గారికే ఈజీగా కుదిరిన విష‌యం. ఎన్టీఆర్ గారి త‌ర్వాత బాల‌కృష్ణ‌గారు అంతే అద్భుతంగా డైలాగ్స్ చెప్ప‌గ‌లుగుతారు. ఇందులో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు." అని ఆయ‌న చెప్పారు.

"ఆయ‌న ఎప్పుడూ రియ‌ల్‌గా క‌నిపిస్తారు. ఈ ప్ర‌పంచంలో అన్నింటికంటే క‌ష్ట‌మైన విష‌యం, మ‌నం అనుకున్న‌ది చేయ‌గ‌ల‌గ‌డం, మ‌నం మ‌న‌లాగా ఉండ‌గ‌ల‌గ‌డం. బాల‌య్య‌గారు అలా ఈజీగా బ‌తుకుతుంటారు." అన్నారు.

"బోయ‌పాటి, బాల‌య్య‌గారి కాంబినేష‌న్ గురించి కొత్త‌గా నేనేమీ చెప్ప‌క్క‌ర్లేదు. జ‌నాలు 'సింహా'తో స్టార్ట్ చేయ‌డం చూశారు. 'లెజెండ్‌'తో పెరిగింది, ఇప్పుడు 'అఖండ‌'తో అన్‌స్టాప‌బుల్‌గా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్ చూసిన‌ప్పుడే బోయ‌పాటికి ఫోన్ చేసి 'అద్భుతంగా ఉంది, పూన‌కాలు వ‌చ్చేలా ఉంది' అని చెప్పాను. తాండ‌వం ఆడిన‌ట్లుగా బాల‌య్య‌గారి ఎన‌ర్జీ ఉంది." అన్నారు.

త‌న ప్ర‌సంగం చివ‌ర‌లో "మీ అంద‌రి ప్రేమ‌, మీ అంద‌రి అభిమానం కోసం జై బాల‌య్య‌!" అంటూ చేయెత్తి చెప్పారు బ‌న్నీ.

Also read:  బాల‌య్య‌ లాంటి ఆటంబాంబును క‌రెక్టుగా ఎలా ప్ర‌యోగించాలో బోయ‌పాటికి తెలుసు!

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.