Read more!

English | Telugu

ముసి ముసి నవ్వుల మీనా.. టాప్ 10 తెలుగు మూవీస్ 

అటు బాలనటిగా, ఇటు కథానాయికగా తెలుగునాట తనదైన అభినయంతో మెప్పించారు అందాల తార మీనా. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అగ్ర తారగా వెలుగొందిన మీనా.. హిందీలోనూ మెరిశారు. అలాంటి మీనా కెరీర్ లో టాప్ 10 తెలుగు సినిమాలేంటో చూద్దాం..

1. సీతారామయ్య గారి మనవరాలు: కథానాయికగా మీనాకి మంచి గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రమిది. క్రాంతికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సీతారామయ్య నటించగా, మనవరాలి పాత్రలో మీనా అలరించారు. మీనా కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా సీతారామయ్య గారి మనవరాలుకి ప్రత్యేక స్థానం ఉంది. 1991లో ఈ హిట్ మూవీ రిలీజైంది.
2. చంటి: మీనా కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ మూవీ చంటి. ఇందులో విక్టరీ వెంకటేశ్ కి జంటగా కనువిందు చేశారు మీనా. 1992లో రిలీజైన ఈ మూవీకి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. తెలుగునాట అపజయమెరుగని జంటగా నిలిచిన వెంకీ, మీనాకి ఇదే ఫస్ట్ కాంబో ఫిల్మ్.
3. అల్లరి మొగుడు: మోహన్ బాబు టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో మీనా ఓ నాయికగా సందడి చేశారు. 1992లో జనం ముందు నిలిచిన ఈ జనరంజక చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 
4. సుందరకాండ: చంటి వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత వెంకీ, మీనా కాంబోలో వచ్చిన మూవీ సుందరకాండ. 1992లోనే రిలీజైన ఈ సక్సెస్ ఫుల్ మూవీకి  కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 
5. ప్రెసిడెంటు గారి పెళ్ళాం: శివ తరువాత సరైన విజయం లేని కింగ్ నాగార్జునకి విజయాన్ని కట్టబెట్టిన సినిమా ప్రెసిడెంటు గారి పెళ్ళాం. 1992లో రిలీజైన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేశారు మీనా. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 
6. అబ్బాయిగారు: వెంకీ, మీనా కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ.. అబ్బాయి గారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ లో.. మీనా యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. 1993లో ఈ హిట్ మూవీ సందడి చేసింది. 
7. బొబ్బిలి సింహం: మాయదారి పిల్లడా.. చేయి వేయకక్కడ.. అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణని మీనా కవ్వించిన చిత్రం బొబ్బిలి సింహం. 1994లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 
8. సూర్యవంశం: వెంకటేశ్ కి జోడీగా మీనా నటించిన నాలుగో సినిమా సూర్యవంశం. హ్యాట్రిక్ హిట్స్ తరువాత వెంకీ, మీనా కాంబోలో వచ్చిన ఈ మూవీ కూడా విజయపథంలో పయనించింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సెన్సేషనల్ మూవీ 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
9. స్నేహం కోసం: మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది మీనా. 1999లో విడుదలైన ఈ హిట్ మూవీకి.. కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహించారు.
10. మా అన్నయ్య: రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాలో.. మీనా నటన ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2000లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ మూవీని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు.

(సెప్టెంబర్ 16.. మీనా బర్త్ డే సందర్భంగా)