English | Telugu
ప్రకాశ్ రాజ్ అడుగుల్లో విజయ్ సేతుపతి?
Updated : Apr 24, 2021
దర్శకుడిగా శంకర్ స్థాయిని పెంచిన సినిమాల్లో 'అన్నియన్' (తెలుగులో 'అపరిచితుడు') ఒకటి. ఇక మూడు ఛాయలున్న పాత్రలో చియాన్ విక్రమ్ నటన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కి ప్రధాన బలంగా నిలిచింది. ఒరిజినల్ వెర్షన్‌తో పాటు డబ్బింగ్ వెర్షన్స్‌లోనూ 'అన్నియన్' అన్ని చోట్లా ఆదరణ పొందింది.
కట్ చేస్తే.. పదహారేళ్ళ తరువాత 'అన్నియన్'ని శంకర్ హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యూత్ ఐకాన్ రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించనున్న ఈ రీమేక్‌లో సదా పోషించిన నందిని పాత్రలో కియారా అద్వాని దర్శనమివ్వనుందని ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రకాశ్ రాజ్ ధరించిన మరో ముఖ్య పాత్ర అయిన డీసీపీ ప్రభాకర్ రోల్‌లో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట శంకర్. మరి.. 'అన్నియన్' రీమేక్‌లో సేతుపతి నటిస్తారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
2022 మధ్యలో సెట్స్ పైకి వెళ్ళనున్న 'అన్నియన్' హిందీ రీమేక్.. 2023లో థియేటర్స్‌లో సందడి చేసే అవకాశముంది. మాతృకలాగే రీమేక్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి మరి.