Read more!

English | Telugu

త‌మిళ‌నాడుకు వ‌చ్చి విజ‌య్ సేతుప‌తికి క‌థ చెప్పిన ఆమిర్ ఖాన్‌!

 

ఆమిర్ ఖాన్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ 'లాల్ సింగ్ చ‌డ్ఢా'లో న‌టించేందుకు వ‌చ్చిన అవ‌కాశాన్ని త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి కోల్పోయాడనీ, దీనికి కార‌ణం అత‌ను బ‌రువు త‌గ్గే విష‌యంలో ఆమిర్‌ను అసంతృప్తికి గురిచేయ‌డ‌మే అనీ మూవీ పోర్ట‌ల్స్‌లో విరివిగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే, ఆ ప్ర‌చారాన్ని సేతుప‌తి స్వ‌యంగా ఖండించాడు. "మొద‌ట‌గా నేను చెప్పేదేమంటే, ఒక యాక్ట‌ర్‌గా ఆమిర్ సార్‌ని నేను అమితంగా గౌర‌విస్తాను. రోల్స్ ఎంచుకొనే విష‌యంలో ఆయ‌నెప్పుడూ నాకు స్ఫూర్తినిస్తూ ఉంటారు. అందుకే నేను ప్ర‌తిసారీ డిఫ‌రెంట్ రోల్‌ను ప్ర‌య‌త్నిస్తుంటాను. ఆయ‌న‌ను వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకున్న‌ప్పుడు ఆయ‌న‌లోని విన‌మ్ర‌త‌, సినిమాపై ఆయ‌న‌కున్న అపార జ్ఞానం న‌న్ను అబ్బుర‌పరిచాయి. ఆయ‌న‌ను క‌ల‌వ‌డ‌మే ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్" అని చెప్పాడు.

'లాల్ సింగ్ చ‌డ్ఢా' మూవీలో త‌న‌కు ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందో సేతుప‌తి వెల్ల‌డించాడు. "ఆమిర్ సార్ వ్య‌క్తిగ‌తంగా ఆ రోల్‌ను నాకు ఆఫ‌ర్ చేశారు. నేను షూటింగ్ చేస్తున్న త‌మిళ‌నాడులోని ఓ చిన్న టౌన్‌కు నాకు స్క్రిప్ట్ వినిపించ‌డానికి ఆయ‌న స్వ‌యంగా వ‌చ్చారు. దేనివ‌ల్లో డైరెక్ట‌ర్ అద్వైన్ చంద‌న్ ఆయ‌న‌తో రాలేదు. ఆమిర్ సార్ ఒక్క‌రే వ‌చ్చి, నాకు స్క్రిప్ట్ వినిపించారు. ఆ రాత్రంతా ఆ టౌన్‌లోనే ఉండి, మ‌రుస‌టి రోజు మార్నింగ్ వెళ్లిపోయారు. అలాంటి బిగ్ సూప‌ర్‌స్టార్ ఆయ‌న‌. అంతేకాదు, ఆయ‌న గొప్ప స్టోరీటెల్ల‌ర్‌. క‌థ‌ను ఆయ‌న చెప్పిన విధానం మెస్మ‌రైజింగ్ అనిపించింది. నేను వెంట‌న్ స‌రే అనేశా." అని చెప్పాడు సేతుప‌తి.

మ‌రెందుకు అత‌ను 'లాల్ సింగ్ చ‌డ్ఢా' నుంచి వైదొల‌గాల్సి వ‌చ్చింది? "ఆ త‌ర్వాత కొవిడ్ మ‌హ‌మ్మారి వ‌చ్చింది. అది మా ప్లాన్స్ అన్నింటినీ ధ్వంసం చేసింది. లాక్‌డౌన్ త‌ర్వాత‌, నా చేతిలో ఐదు తెలుగు ప్రాజెక్టులు వేర్వేరు స్టేజ్‌ల‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్య‌త నా మీద ఉంది. దాంతో 'లాల్ సింగ్ చ‌డ్ఢా'కు నా షెడ్యూల్‌లో డేట్స్ ఇవ్వ‌లేక‌పోయాను." అని సేతుప‌తి స్ప‌ష్టం చేశాడు.

ఆమిర్ ద‌యాగుణం గురించి తెగ ప్ర‌శంసించాడు సేతుప‌తి. "నేను ముంబైకి వెళ్లిన‌ప్పుడు, ఆమిర్ సార్ న‌న్ను వాళ్లింటికి ఆహ్వానించారు. త‌న ఇంటికి ఎలా చేరుకోవాలో నా డ్రైవ‌ర్‌కు ఆయ‌న స్వ‌యంగా సూచ‌న‌లు చేశారు. ఆయ‌న ప‌ర్ఫెక్ట్ హోస్ట్‌. ఒక్క‌సారి కాదు రెండు సార్లు. ఆయ‌న ద‌యాగుణాన్ని, సినిమాపై ఆయ‌నకున్న నాలెడ్జ్‌ని నేనెప్ప‌టికీ మ‌ర‌వ‌ను. స‌మీప భ‌విష్య‌త్తులో ఏదో ఒక‌నాటికి ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌స్తే అది నాకు గౌర‌వం, ఆనంద‌క‌రం." అని అత‌ను తెలిపాడు.