Read more!

English | Telugu

నేడే దియా మీర్జా రెండో పెళ్లి!

 

బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ ఏషియా పెసిఫిక్ దియా మీర్జా నేడు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. లేటెస్ట్‌గా నాగార్జున భార్య‌గా 'వైల్డ్ డాగ్' మూవీలో న‌టించ‌డం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారామె. ఆ మూవీ త్వ‌ర‌లో ఓటీటీలో నేరుగా రిలీజ్ కానున్న‌ది. కొంత కాలంగా ఆమె ముంబైకి చెందిన‌ బిజినెస్‌మ్యాన్ వైభ‌వ్ రేఖ్‌తో డేటింగ్‌లో ఉన్నారు. అలా అని బ‌హిరంగంగా ఆయ‌న‌తో చెట్టాప‌ట్టాలేసుకొని తిర‌క్కుండా ఓ ప్రైవేట్ వ్య‌వ‌హారంగానే దీన్ని మెయిన్‌టైన్ చేస్తూ వ‌చ్చారు. కొద్దిమంది స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల‌ స‌మ‌క్షంలో దియా, వైభ‌వ్ పెళ్లి వేడుక నేటి రాత్రి జ‌ర‌గ‌నున్న‌ది. ఈ వేడుక‌లో 50 మంది లోపే అతిథులు పాల్గొంటున్న‌ట్లు స‌మాచారం.

వివాహం సంద‌ర్భంగా దియా నివాసం మెయిన్ గేట్‌ను వైట్ అండ్ పింక్ ఫ్ల‌వ‌ర్స్‌తో డెక‌రేట్ చేసిన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. అలాగే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఇంకో వీడియోలో గార్డెన్ ఏరియాలోని చెట్ల‌ను వైట్ అండ్ పింక్ క‌ల‌ర్స్‌తో అలంక‌రించ‌డం క‌నిపిస్తోంది. పెళ్లికి అటెండ్ అవుతున్న స‌న్నిహితుల్లో బాలీవుడ్‌కు చెందిన కొద్దిమంది సెల‌బ్రిటీలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ పెళ్లికి సంగీత్ ఫంక్ష‌న్ లాంటిదేమీ జ‌ర‌ప‌డం లేదు. కానీ రెండు కుటుంబాల వారూ క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతున్నారు.

గ‌తంలో దియా ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్ సాహిల్ సంఘాను 2014లో పెళ్లాడారు. కానీ వారి వైవాహిక బంధం ఐదేళ్ల‌కే ముగిసింది. ఆ ఇద్ద‌రూ 2019లో డైవోర్స్ తీసుకున్నారు.