English | Telugu
నయనతార వెంటే ఉంటామంటున్న ఫ్యామిలీ!
Updated : Jul 19, 2023
సదర్న్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్, తలైవి నయనతారకు సంబంధించిన ప్రతిదీ ఇప్పుడు వైరల్ అవుతోంది. దానికి రీజన్ ఆమె నార్త్ ఎంట్రీ. ఇటీవల ఆమె పోస్టర్‌ని విడుదల చేసిన షారుఖ్ ఖాన్ వర్షించడానికి ముందు ఉరిమే మేఘం ఆమె అంటూ ఇంట్రడ్యూస్ చేశారు. చేతిలో మెషిన్ గన్‌తో, సీరియస్ ప్లస్ స్టైలిష్ లుక్స్ తో అలరించారు నయనతార. అట్లీ దర్శకత్వంలో నయనతార నటించడం ఇదేం మొదటిసారి కాదు. కానీ, బాలీవుడ్‌లో నటించడం ఇదే తొలిసారి. షారుఖ్‌తో నటించడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. సౌత్ గర్ల్స్ నార్త్ లో పెద్దగా కాంపిటిషన్ ఇవ్వలేరు, తట్టుకోలేరు అనే టాక్ ఉన్న టైమ్‌లో, నాకు నార్త్ అంటే ఇంట్రస్ట్ లేదు అని చెప్పేశారు నయనతార. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. నార్త్ ఆమె ప్రెజెన్స్ కోరుకుంది. ఆమెకు అవకాశం ఇచ్చి రా రమ్మని పిలిచింది. అంతే గొప్పగా ఆమెను రిజీవ్ చేసుకుంటోంది.
దీనికి సంబంధించి నయన్ ఫ్యాన్స్ జోష్ డబుల్ చేసేలా ఓ పోస్ట్ పెట్టారు నయన్ భర్త విఘ్నేష్ శివన్. ``నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది తంగమే (బంగారం). షారుఖ్ సర్‌కి నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్‌వో నాకు తెలుసు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగావు. ఇప్పుడు ఆయన సినిమాల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నావు. ఆయనతో అంత పెద్ద సినిమాలో నటిస్తున్నావు. నీ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. నిన్ను చూసి మన కుటుంబం గర్వపడుతోంది`` అని నయన్ గురించి పోస్ట్ చేశారు ఆమె భర్త విఘ్నేష్ శివన్. తన లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ అని అంటారు నయనతార. అతను పక్కనుంటే, సమస్య ఎంత పెద్దదైనా, ఎవరితో అయినా తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అన్నిటినీ అతను బ్యాలన్స్ చేసుకుంటాడని ఇదివరకే చెప్పారు నయనతార. 2003లో మనసినక్కరె సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నయనతార. ఇది ఆమెకు ఇండస్ట్రీలో 20వ సంవత్సరం.