English | Telugu
ఆలియాతో గేమ్స్ ఆడనంటున్న భర్త!
Updated : Jul 19, 2023
భార్యాభర్తలిద్దరూ సెలబ్రిటీలైతే, మీడియా ముందు ఒకరి గురించి ఒకరు చెప్పుకునే విషయాలు చాలా ఫన్నీగా, ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. రీసెంట్‌గా తన భార్య ఆలియాతో తాను ఫుట్‌బాల్ ఆడనని రణ్‌బీర్ చెప్పిన మాటలు కూడా జనాలకు అంతే ఇంట్రస్ట్ కలిగిస్తున్నాయి. రణ్‌బీర్ అలా ఎందుకు అన్నట్టు? ఆలియా ఫుట్‌బాల్‌లో అంత ప్రావీణ్యం సంపాదించారా? రణ్‌బీర్‌కి ఫుట్‌బాల్ అంత బాగా వచ్చా? ఎప్పుడు నేర్చుకున్నారు? అంటూ ఎవరి ఊహలకు వాళ్లు పదును పెట్టేస్తున్నారు. ఇటీవల ముంబైలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఓ టీమ్‌కి కో ఓనర్‌గా ఉన్నారు రణ్‌బీర్. ఆ మ్యాచ్‌లకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు రణ్‌బీర్. ఈ సందర్భంగా ఆయనకు ఫుట్‌బాల్‌కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. భార్య ఆలియాతో ఎప్పుడైనా ఫుట్‌బాల్ ఆడారా? అనే ప్రశ్న ఎదురైంది. అందుకు రణ్‌బీర్ ఇచ్చిన సమాధానం ఆలియా ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చింది. `నేను ఆలియాతో ఆడను` అనేశారు రణ్‌బీర్. ఎందుకలా అన్నారని ఇంకో ప్రశ్న ఎదురైంది. `ఆమెకి పోటీ తత్వం ఎక్కువ. కచ్చితంగా గెలిచి తీరాలని అనుకుంటుంది.
ఒకవేళ నేను ఆమెను బీట్ చేస్తే, తప్పకుండా చాలా రోజుల పాటు అది పెద్ద వార్తవుతుంది. తాను ఓడిపోయానని, నేను తనను గెలిచానని పదే పదే జనాలు అంటుంటారు. అది విని, ఆమె బాధపడుతుంది. తను అలా బాధపడటం నాకు నచ్చదు`` అని అన్నారు. ఒకవేళ ఆలియా గెలిస్తే, నాన్‌స్టాప్‌సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు కదా అని అడగగా ``చూశారా? అప్పుడు కూడా నేనే ఇరుక్కుంటాను. అంటే గెలుపు ఎవరిదైనా ఇరకాటం మాత్రం నాదే. అందుకే నేను తనతో ఆడదలచుకోలేదు`` అని అన్నారు. కలిసి ఆడితే, కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని రణ్‌బీర్ మాటకు కరీనా స్పందించింది. అది చూసి వావ్ అంటున్నారు అభిమానులు.