Read more!

English | Telugu

స‌ల్మాన్ ముందే క‌త్రినాకు ప్ర‌పోజ్ చేసిన విక్కీ.. ట్రెండింగ్‌లో వీడియో!

 

2019లో ఒక అవార్డ్ ఫంక్ష‌న్‌లో కత్రినా కైఫ్‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ చేశాడు విక్కీ కౌశ‌ల్‌. అత‌డి ప్ర‌పోజ‌ల్‌కు క‌త్రినా ఇచ్చిన రియాక్ష‌న్ మామూలుగా లేదు. ఆ ఈవెంట్‌లో స‌ల్మాన్ ఖాన్ కూడా పాల్గొన‌డం గ‌మ‌నార్హం. క‌త్రినా, స‌ల్మాన్ కొంత‌కాలం డేటింగ్‌లో ఉన్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెప్పే మాట‌. క‌త్రినా, విక్కీ వెడ్డింగ్ రూమ‌ర్స్ మ‌ధ్య ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఆ ఇద్ద‌రి ఫ్యాన్స్ వారి పెళ్లి కోసం ఆత్రుత‌గా వెయిట్ చేస్తున్నారు.

బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారంలోకి వ‌చ్చిన దాని ప్ర‌కారం క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ డిసెంబ‌ర్ 7 నుంచి 9 మ‌ధ్య రాజ‌స్థాన్‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంత‌దాకా ఆ ఇద్ద‌రి నుంచి ఎలాంటి స్పంద‌న కానీ, క‌న్ఫ‌ర్మేష‌న్ కానీ లేక‌పోయినా, ఫ్యాన్స్ మాత్రం వాళ్లిద్ద‌రికీ పెళ్ల‌వ‌నున్న‌ద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. వారు పెళ్లి చేసుకుంటానే అంచ‌నాతో ప‌లు ఫ్యాన్ పేజీలు ఆ జంట‌కు సంబంధించిన ఓల్డ్ వీడియోల‌ను షేర్ చేస్తున్నాయి. వాటిలో క‌త్రినాకు విక్కీ ప్ర‌పోజ్ చేస్తున్న వీడియో వైర‌ల్ అయింది.

ఆ వీడియోలో ఒక అవార్డ్ ఫంక్ష‌న్‌లో విక్కీ, క‌త్రినా స్టేజ్ మీద ఉన్నారు. క‌త్రినాను, "విక్కీ కౌశ‌ల్ లాంటి నైస్ బాయ్‌ను నువ్వెందుకు క‌నిపెట్టి, అత‌డిని పెళ్లి చేసుకోకూడ‌దు? ఇప్పుడు పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. కాబ‌ట్టి.. నువ్వు కూడా అలా చేయాల‌నుకుంటున్నాను. కాబ‌ట్టి, నేను నిన్ను అడగాల‌నుకుంటున్నాను" అన్నాడు విక్కీ. వెంట‌నే క‌త్రినా ర‌క‌ర‌కాల ఎక్స్‌ప్రెష‌న్స్ ప్ర‌ద‌ర్శిస్తూ, "వాట్‌?" అంది. అప్పుడు స‌రిగ్గా స‌ల్మాన్ ఖాన్ పాట 'ముజ్‌సే షాదీ క‌రోగీ' మైక్‌లో ప్లే అయింది. విక్కీ కౌశ‌ల్ "ముజ్‌సే షాదీ క‌రోగీ" అని పాడ‌గా, క‌త్రినా న‌వ్వుతూ "నాకంత ధైర్యం లేదు" అని చెప్పింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, ఆ ఈవెంట్‌కు స‌ల్మాన్ ఖాన్ గెస్ట్‌గా హాజ‌ర‌వ‌డం, అత‌ని ఎదుటే క‌త్రినాకు విక్కీ ప్ర‌పోజ్ చేయ‌డం!