English | Telugu

విమానం కూలిన ఘ‌ట‌న‌లో పాపుల‌ర్ సింగ‌ర్ మృతి

విమానం కుప్ప‌కూలిన‌ ప్ర‌మాదంలో బ్రెజిల్‌కు చెందిన‌ ప్ర‌ముఖ ఇంట‌ర్నేష‌న‌ల్ పాప్ సింగ‌ర్ మ‌రిలియా మెండోంకా మృత్యువాత ప‌డింది. కొద్ది గంట‌ల్లో క‌చేరీలో పాల్గొని సంగీత ప్రియుల‌ను, అభిమానుల‌ను అల‌రించాల్సిన ఆమె, త‌ను ప్ర‌యాణిస్తున్న ప్లేన్ ప్ర‌మాద‌వ‌శాత్తూ కూలిపోవ‌డంతో ఆమె క‌న్నుమూసింది. ఆమెతో పాటు ఈ ప్రమాదంలో ఆమె మేనేజర్‌ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హో, పైలట్‌, కోపైలట్‌ కూడా మ‌ర‌ణించారు.

ఒక కాన్స‌ర్ట్‌లో పాల్గొన‌డానికి మెండోంకా మిడ్‌వెస్ట్ర‌న్ సిటీ గొయానియా నుంచి క‌రాటింగాకు బ‌య‌లుదేరింది. ప్ర‌మాద‌వ‌శాత్తూ ఒక ఎల‌క్ట్రిక‌ల్ డిస్ట్రిబ్యూష‌న్ లైన్‌ను ఢీకొట్టిన విమానం కుప్ప‌కూలిపోయింద‌ని స‌మాచారం. మెండోంకా ఆక‌స్మిక మృతితో ఆమె అభిమానులు, మ్యూజిక‌ల్ ల‌వ‌ర్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఈ ప్ర‌మాదం శుక్ర‌వారం జ‌రిగింది. ఈ ప్ర‌మాదానికి కొద్ది గంట‌ల‌ముందే మెండోంకా ఒక వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. దాన్ని చూసిన అభిమానులు మ‌రికొద్దిసేప‌ట్లోనే త‌మ అభిమాన గాయ‌ని తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో శోక‌సంద్రంలో మునిగిపోయారు. మెండోంకా వ‌య‌సు కేవ‌లం 26 సంవ‌త్స‌రాలు.

2019లో రిలీజ్ చేసిన 'సెర్టానోజో' ఆల్బ‌మ్‌తో మెండోంకా వెలుగులోకి వ‌చ్చింది. ఆ ఆల్బ‌మ్‌కు లాటిన్ గ్రానీ అవార్డు సైతం ఆమె అందుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు 39.5 మిలియ‌న్ల మంది ఫాలోయ‌ర్స్ ఉండ‌టం చూస్తే, ఆమె ఎంత‌టి పాపుల‌ర్ సింగ‌రో ఊహించ‌వ‌చ్చు. స‌హ గాయ‌కుడు, సాంగ్ రైట‌ర్ మురిలో హ‌ఫ్‌తో రిలేష‌న్‌లో ఉన్న ఆమె, అత‌ని ద్వారా ఓ కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. అత‌డికి వ‌చ్చే నెల‌లో రెండేళ్లు నిండ‌నున్నాయి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.