English | Telugu
హిరాణీ మూవీ కావాలంటున్న వరుణ్!
Updated : Aug 1, 2023
బవాల్‌లో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ చూపించారు బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్. జాన్వీ కపూర్‌తో కలిసి ఫస్ట్ టైమ్ పనిచేశారు. దర్శకుడు నితీష్ తివారితోనూ ఆయనది ఫస్ట్ కాంబినేషనే. అయినా చాలా మంచి రివ్యూలు వస్తున్నాయి. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది టీమ్. పలు రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పారు వరుణ్ ధావన్. ``నేను ఇప్పటిదాకా శ్రీరామ్ రాఘవన్, సూజిత్ సిర్కార్, నితీష్ తివారిలాంటివారితో పనిచేశాను. నెక్స్ట్ నా బకెట్ లిస్టులో అట్లీ ఉన్నారు. ఎప్పటి నుంచో అట్లీతో పనిచేయాలని ఉంది. అయితే ఆయన నిర్మాణంలో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. ఏదో ఒక రకంగా ఆయనతో కొలాబరేట్ అవుతున్నాను. ఒకవేళ రాజ్‌కుమార్ హిరాణీతో పనిచేసే అవకాశం వస్తే, నా కల నిజమైనట్టే. ఆ రోజు నిజంగా హ్యాపీగా ఫీలవుతాను`` అని అన్నారు.
వరుణ్ ధావన్ ఇటీవల రాజ్ అండ్ డీకే డైరక్షన్‌లో సిటాడెల్ పూర్తి చేశారు. ఈ సీరీస్‌లో సమంత నటించారు. ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్‌కి ఇండియన్ వెర్షన్‌లో వీరిద్దరూ నటించారు. వరుణ్ ధావన్ నటిస్తున్న 18వ సినిమాను అట్లీ సమర్పిస్తున్నారు. ఆగస్టులో షూటింగ్ మొదలవుతుంది. తమిళ దర్శకుడు ఖలీస్ డైరక్షన్ చేస్తారు. ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.