English | Telugu
దీపిక వద్దంటుంటే సల్మాన్‌కి అర్థం కాదా?
Updated : Jul 30, 2023
సినిమా ఇండస్ట్రీలో కొందరి మధ్య ఉన్న విషయాలు ఎప్పటికీ గుట్టుగానే ఉంటాయి. ఎంత తెలుసుకుందామనుకున్నా బట్టబయలు కావు. ఇలాంటిదే సల్మాన్, దీపిక మధ్య ఏదో ఉందనే విషయం చాలా మంది మనసుల్ని తొలుస్తూ ఉంటుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టాల్ వాట్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ ఇప్పటిదాకా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. చాలా సార్లు ఆ అవకాశాలు వచ్చినా ఎందుకో ఇప్పటిదాకా సాకారం కాలేదు.
జై హో, సుల్తాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, కిక్ సినిమాల్లో నటించమని దీపిక పదుకోన్‌కి ప్రపోజల్స్ వెళ్లాయట. అయితే ఆమె అంగీకరించలేదు. వాటిదాకా ఎందుకు? దీపిక ఫస్ట్ హిందీ సినిమా కూడా సల్మాన్‌ఖాన్‌తో నటించాల్సింది. కానీ ఆమె చేయడానికి ఇష్టపడలేదట. కొన్నేళ్లు ఆగి మరీ, షారుఖ్ మూవీ ఓం శాంతి ఓంని సెలక్ట్ చేసుకున్నారు.
సంజయ్ లీలా భన్సాలి ఇన్షా అల్లాలో నటించడానికి దీపిక ఒకానొక సందర్భంలో ఇంట్రస్ట్ చూపించారట. అయితే ఆ విషయం భన్సాలికి తెలిసేసరికి ఆలస్యమైంది. లీడ్ రోల్‌కి అప్పటికే ఆలియా భట్‌ని అనుకున్నారు. కాస్త పెద్ద వయసున్న వ్యక్తి చిన్న పిల్లతో ప్రేమలో పడటం అనే కథకు ఆలియా పర్ఫెక్ట్ అనుకున్నారు మేకర్స్. అందుకే అప్పుడు కుదరలేదు.
టైగర్ వర్సెస్ పఠాన్‌లో దీపిక, సల్మాన్ కలిసి నటిస్తారని అనుకున్నారు. అయితే అందులో కూడా స్పేస్ లేదనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం దీపిక పదుకోన్ ప్రాజెక్ట్ కె లోనూ, ఫైటర్‌లోనూ నటిస్తున్నారు. ద్రౌపది రోల్ ఆధారంగా తెరకెక్కే సినిమాలో టైటిల్ రోల్ పోషించడానికి కూడా ఓకే చెప్పారట ఈ బ్యూటీ. అనుకోకుండా జరిగినా, అనుకునే జరిగినా, దీపిక పదుకోన్ కోసం సల్మాన్ పలుమార్లు అవకాశాలు పంపుతూనే ఉన్నారు. ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చూడాలి.