English | Telugu

'ఆర్ఎక్స్ 100' రీమేక్ 'త‌డ‌ప్' డిసెంబ‌ర్‌లో రిలీజ్‌!

కార్తికేయ హీరోగా అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేసిన 'ఆర్ఎక్స్ 100' చిన్న సినిమాల్లో బ్ల‌క్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఆ సినిమాలో హీరోగా కార్తికేయ క్రేజ్ తెచ్చుకోగా, హీరోను ట్రాప్ చేసి, చివ‌ర‌కు అత‌డిని మోసం చేసే పాత్ర‌లో పాయ‌ల్ రాజ్‌పుత్ సూప‌ర్బ్‌గా రాణించింది. ఇప్పుడు ఆ సినిమా హిందీలో 'త‌డ‌ప్' పేరుతో రీమేక్ అవుతోంది. మిల‌న్ లూథ్రియా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ద్వారా సునీల్ శెట్టి కుమారుడు అహ‌న్ శెట్టి హీరోగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నాడు.

ఒరిజిన‌ల్‌లో పాయ‌ల్ చేసిన క్యారెక్ట‌ర్‌ను 'త‌డ‌ప్‌'లో తారా సుతారియా చేస్తోంది. లేటెస్ట్‌గా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ 3న ఈ సినిమా విడుద‌ల కానున్న‌ది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ స‌మ‌ర్పిస్తోన్న ఈ మూవీని సాజిద్ న‌దియ‌డ్‌వాలా నిర్మిస్తున్నాడు.

షూటింగ్‌కు ముందు అహ‌న్‌, తార‌ల‌తో డైరెక్ట‌ర్ మిల‌న్ రిహార్స‌ల్ వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించాడు. వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ సూప‌ర్బ్‌గా ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డాడు. కాగా తెలుగులో రాంకీ పోషించిన క్యారెక్ట‌ర్‌ను 'త‌డ‌ప్‌'లో సునీల్ శెట్టి చేస్తుండ‌టం విశేషం. అంటే, కొడుకు తొలి సినిమాలో తండ్రి కూడా న‌టిస్తున్నాడ‌న్న మాట‌.

ప్రీత‌మ్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్‌ను హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ స‌మ‌కూరుస్తున్నాడు. ఒరిజిన‌ల్‌కు అత‌డిచ్చిన బీజీఎం బాగా న‌చ్చ‌డంతో హిందీ రీమేక్‌కు అత‌డి చేతే బీజీఎం చేయిస్తున్నాడు డైరెక్ట‌ర్ మిల‌న్‌.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.