English | Telugu
సల్మాన్ కి విలన్ గా ఇమ్రాన్!
Updated : Aug 24, 2021
హిందీనాట `సీరియల్ కిస్సర్`గా పేరు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. `మర్డర్`, `గ్యాంగ్ స్టర్`, `ఆవారాపన్`, `ద డర్టీ పిక్చర్` చిత్రాలతో బాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. త్వరలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి విలన్ గా దర్శనమివ్వబోతున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఏక్ థా టైగర్` (2012), `టైగర్ జిందా హై` (2017) వంటి విజయవంతమైన చిత్రాల తరువాత `టైగర్` ఫ్రాంచైజీలో `టైగర్ 3` పేరుతో మరో సినిమా రానుంది. ఆ రెండు చిత్రాల్లో జంటగా నటించిన సల్మాన్, కత్రినా కైఫ్.. ఈ చిత్రంలోనూ జోడీకట్టారు. మనీశ్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం రష్యాలో జరుగుతోంది. దాదాపు 45 రోజుల పాటు ఏకధాటిగా రష్యా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపనున్నారని సమాచారం. కాగా, ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా ఇమ్రాన్ కనిపించబోతున్నాడు. అంతేకాదు.. పాత్ర కోసం భారీగా కండలు పెంచే పనిలో ఉన్నట్లు బజ్. మరి.. సల్మాన్ ని ఢీ కొడుతున్న ఇమ్రాన్.. ఈ చిత్రంతో ఎలాంటి గుర్తింపుని పొందుతాడో చూడాలి.
