English | Telugu

'సూర్య‌వంశీ'కి ఇండియాలో ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్లు!

అక్ష‌య్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన 'సూర్య‌వంశీ' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపుతోంది. దేశంలో ఆ సినిమా రూ. 100 కోట్ల మార్కును క్రాస్ చేయ‌డంతో, ఆ సినిమాతో సంబంధం వున్న‌వాళ్లంతా సెల‌బ్రేష‌న్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. విడుద‌లైన నాలుగో రోజు, అంటే సోమ‌వారం ఆ సినిమా రూ. 14.51 కోట్ల‌ను రాబ‌ట్టింది. మంగ‌ళ‌వారం కూడా క‌లెక్ష‌న్లు మెరుగ్గా ఉండ‌టంతో, ఐదు రోజుల‌కే ఆ మూవీ సెంచ‌రీ కొట్టింది.

ట్రేడ్ వ‌ర్గాల ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం మంగ‌ళ‌వారం సూర్య‌వంశీ రూ. 11.5 కోట్ల నుంచి రూ. 12.5 కోట్ల మ‌ధ్య వ‌సూళ్లు సాధించింది. వారం మ‌ధ్య‌లో కూడా క‌లెక్ష‌న్లు రూ. 10 కోట్ల‌కు పైగా ఉండ‌టం బ‌య్య‌ర్ల‌ను అమితానందానికి గురిచేసింది. దాంతో ఒక్క ఇండియాలోనే ఆ సినిమా రూ. 103.09 - 104.09 కోట్ల మ‌ధ్య ఉంటుంద‌ని అంచ‌నా. కొవిడ్ మ‌హ‌మ్మారి కాలంలో రూ. 100 కోట్ల మార్కును అందుకున్న తొలి హిందీ సినిమాగా 'సూర్య‌వంశీ' నిల‌వ‌డంతో ఇటు బాలీవుడ్‌, అటు థియేట‌ర్ ఓన‌ర్లు బిగ్ రిలీఫ్ ఫీల‌వుతున్నారు. నిర్మాత‌ల‌కు, ఎగ్జిబిట‌ర్ల‌కు క‌చ్చితంగా ఈ సినిమా హోప్‌నిచ్చింది.

క‌త్రినా కైఫ్‌, జాకీ ష్రాఫ్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, అభిమ‌న్యు సింగ్‌, జావెద్ జాఫ్రీ కీల‌క పాత్ర‌లు చేసిన ఈ మూవీలో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, ర‌ణ‌వీర్ సింగ్ స్పెష‌ల్ రోల్స్ చేశారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.