English | Telugu

షారుక్ ఖాన్ మూవీలో న‌య‌న‌తార క్యారెక్ట‌ర్ ఏమిటో తెలిసింది!

కొద్ది వారాలుగా షారుక్ ఖాన్ వ్య‌క్తిగ‌తంగా సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాడు. కొడుకు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్ కేసులో అరెస్ట‌వ‌డంతో, త‌న ప్రాజెక్టుల షూటింగ్స్‌ను ఆయ‌న వాయిదా వేసుకున్నాడు. బెయిల్ మీద ఆర్య‌న్ ఇంటికి వ‌చ్చేయ‌డంతో, తిరిగి షూటింగ్స్ కొన‌సాగించాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా అట్లీ డైరెక్ట్ చేస్తోన్న ల‌య‌న్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నాడు. ఈ మ‌ధ్య‌లో ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించాల్సిన న‌య‌న‌తార డేట్స్ స‌మ‌స్య కార‌ణంగా త‌ప్పుకుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే అందులో ఏమాత్రం నిజం లేద‌ని స్ప‌ష్టంగా తెలిసింది.

యూనిట్ స‌భ్యుల్లో ఒక‌రు, న‌య‌న‌తార ఈ సినిమాలో కీల‌క పాత్ర చేస్తున్నారు. ఆమె ఈ సినిమాని వ‌దిలేయ‌లేదు. అలాంటి క‌థ‌లు మీడియా ఎందుకు అల్లుతుందో తెలీదు. ఇప్ప‌టికే ఒత్తిడిలో ఉన్న వ్య‌క్తిని ఇంకా ఇబ్బంది పెట్ట‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నిస్తుందో అర్థం కాదు. ఇది స‌రైన ప‌ని కాదు అని చెప్పారు.

ఏదేమైన‌ప్ప‌టికీ, ఈ సినిమాలో న‌య‌న‌తార చేస్తున్న క్యారెక్ట‌ర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ తెలియ‌వ‌చ్చింది. ఈ మూవీలో న‌య‌న‌తార ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. షారుక్ ఖాన్ తండ్రీ కొడుకులుగా డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు. త‌ప్పుడు నేరారోప‌ణ‌ల కార‌ణంగా జైలు జీవితం అనుభ‌విస్తోన్న స్త్రీల‌ను కాపాడి, వారిని అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డే వారికి వ్య‌తిరేకంగా పోరాడే శ‌క్తులుగా మ‌లిచే వ్య‌క్తి క‌థ ఇది. వారి కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీసాఫీస‌ర్‌గా న‌య‌న‌తార క‌నిపిస్తారు. ఈ క్ర‌మంలో షారుక్ ఖాన్‌తో ఆమె త‌ల‌ప‌డ‌తారు. వారి మ‌ధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది. అని ఆ యూనిట్ మెంబ‌ర్ తెలిపారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.