English | Telugu
రోహిత్ శెట్టి: ది హిట్ మెషీన్.. వరుసగా రూ. 100 కోట్ల క్లబ్ మూవీస్ 9!!
Updated : Nov 10, 2021
బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అరుదైన ఘనత సాధించాడు. వరుసగా తొమ్మిదోసారి రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిన సినిమాను రూపొందించిన తొలి హిందీ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించాడు. 'గోల్‌మాల్ '3 (2010) మూవీ నుంచి మొదలుపెట్టి, ఇప్పుడు వచ్చిన 'సూర్యవంశీ' మూవీ వరకు అతడు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా ఇండియాలో రూ. 100 కోట్ల నెట్‌ను కలెక్ట్ చేయడం విశేషం. ఈ తొమ్మిది సినిమాల్లో రూ. 200 కోట్ల మార్కును దాటిన సినిమాలు మూడు ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే 'సూర్యవంశీ' సైతం ఈ క్లబ్బులో చేరే అవకాశాలున్నాయి. థియేటర్లలో ఆడియెన్స్‌ను రోహిత్ వినోదింపజేస్తుంటే, ఆయన డిస్ట్రిబ్యూటర్లు హాయిగా నవ్వుకుంటూ గల్లాపెట్టెలు నింపుకుంటున్నారు.
మహమ్మారి టైమ్‌లో, అదీ మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతోటే థియేటర్లు నడుస్తున్న కాలంలో కేవలం ఐదు రోజులకే 'సూర్యవంశీ' మూవీ వంద కోట్ల మార్కును అందుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఇంకో విశేషమమేంటే ఈ తొమ్మిది సినిమాల్లో ఐదు సినిమాలు అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించినవి. షారుక్ ఖాన్ రెండు (చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలే), రణవీర్ సింగ్ ఒకటి (సింబా), అక్షయ్ కుమార్ ఒకటి (సూర్యవంశీ) సినిమాలు వీటిలో ఉన్నాయి.
రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయగా, రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిన సినిమాలు:
గోల్‌మాల్ 3 - రూ. 106.34 కోట్లు (అజయ్ దేవ్‌గణ్)
సింగమ్ - రూ. 100.30 కోట్లు (అజయ్ దేవ్‌గణ్)
బోల్ బచ్చన్ - రూ. 102.94 కోట్లు (అజయ్ దేవ్‌గణ్, అభిషేక్ బచ్చన్)
చెన్నై ఎక్స్‌ప్రెస్ - రూ. 227.13 కోట్లు (షారుక్ ఖాన్)
సింగమ్ రిటర్న్స్ - రూ. 140.62 కోట్లు (అజయ్ దేవ్‌గణ్)
దిల్‌వాలే - రూ. 148.72 కోట్లు (షారుక్ ఖాన్, వరుణ్ ధావన్)
గోల్‌మాల్ అగైన్ - రూ. 205.69 కోట్లు (అజయ్ దేవ్‌గణ్)
సింబా - రూ. 240.31 కోట్లు (రణవీర్ సింగ్)
సూర్యవంశీ - రూ. 102.81 కోట్లు (5 రోజులకు) (అక్షయ్ కుమార్)