English | Telugu
ఎన్ఎఫ్‌టి మార్కెట్లోకి అడుగుపెడుతున్న తాప్సీ
Updated : Jul 7, 2023
తాప్సీ పన్ను గురించి డిజిటల్ స్పేస్‌లో గట్టిగానే డిస్కషన్ జరుగుతోంది. ఆమె ఎన్ ఎఫ్ టి స్పేస్‌లోకి అడుగుపెడుతున్నారన్నది ఆ వార్త సారాంశం. అందులో భాగంగానే ఆర్ట్ పోస్టులు విరివిగా చేస్తున్నారంటున్నారు సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్స్.
నాన్ ఫంజిబుల్ టోకెన్స్ - ఎన్ ఎఫ్ టి వరల్డ్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు తాప్సీ. ఆల్రెడీ ఈ విషయంలో ఆరితేరిపోయారు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, సల్మాన్‌ఖాన్. ఇప్పుడు తాప్సీ కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నారు. తాప్సీకి ఈ విషయాన్ని గురించి ఎవరు అవేర్‌నెస్ క్రియేట్ చేశారన్నది సస్పెన్స్.
ఇటీవల ఆమె పెడుతున్న వరుస పోస్టులు గమనించిన వారు మాత్రం తాప్సీ ఎన్ఎఫ్‌టిల మీద మనసు పారేసుకున్నారనే అంటున్నారు. ఒక పోస్టులో ఆమె చుట్టూ నచ్చే విషయాలన్నీ ఉన్నాయి. మొక్కలున్నాయి. లయన్ కూడా కనిపిస్తోంది. మరో పోస్టులో ఆమె పోర్టల్‌లోకి ఎంటర్ కావడం, అక్కడ అత్యద్భుతమైన అవకాశాలుండటాన్ని గమనించడం కనిపిస్తుంది. మూడో పోస్ట్ లో తన డిజిటల్ సెల్ఫ్‌తో మాట్లాడుతున్న తాప్సీ కనిపిస్తుంది. మరో డైమన్షన్‌లో ఉంటుంది ఆ ఆకారం.
తాప్సీ ఇటీవల నటించిన సినిమా బ్లర్. అజయ్ దర్శకత్వం వహించారు. గుల్షన్ దేవయ్య అందులో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆమె చేతిలో మరిన్ని ఇంట్రస్టింగ్ ప్రాజెక్టులున్నాయి. త్వరలోనే షారుఖ్‌తో కలిసి డంకీలో కనిపించనున్నారు ఈ బ్యూటీ. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆమె హసీనా దిల్‌రుబా సీక్వెల్ ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబాలో నటించనున్నారు.
ఢకఢక్ ఆమె ప్రొడక్షన్ వెంచర్. తరుణ్ డుడేజా దర్శకత్వం వహిస్తారు. నలుగురు మహిళలకు సంబంధించిన కథ ఇది. రత్న పాథక్ షా, ఫాతిమా సనా షేక్, దియా మిర్జా, సంజనా సంఘి కీ రోల్స్ చేస్తున్నారు. 4 విమెన్, 4 బైక్స్, 1 ఎపిక్ జర్నీ అంటూ ఈ సినిమా గురించి షేర్ చేసుకున్నారు తాప్సీ.