English | Telugu

శిల్పాశెట్టికి మరో షాక్.. ఆమె, ఆమె తల్లిపై చీటింగ్ కేసు

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పోర్నోగ్రఫీ కేసులో ఆమె భర్త అరెస్ట్ అయ్యాడు. మరోవైపు ఆమెపైన, ఆమె భర్త పైన పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై చీటింగ్‌ కేసు నమోదైంది.

'అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా' పేరుతో శిల్పాశెట్టి ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ ను నిర్వహిస్తోంది. దీనికి ఆమె చైర్మన్‌ గా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌ గా ఉన్నారు. ఈ ఫిట్‌నెస్ సెంటర్ మరో బ్రాంచ్‌ ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం​ చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు వీరిద్దరిపై లక్నోలోని హజరత్ గంజ్, విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్‌ సుమన్‌ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు ఒక బృందంతో డీసీపీ ముంబై చేరుకుంన్నారు.