English | Telugu

షాకింగ్‌.. రాజ్ కుంద్రా బావ‌తో మొద‌టి భార్య వివాహేత‌ర బంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేశారు!

మాజీ భార్య క‌విత వివాహేత‌ర సంబంధం గురించి శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా ఇచ్చిన లేటెస్ట్‌ స్టేట్‌మెంట్ సంచ‌ల‌నం సృష్టించింది. 2009లో బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టిని రాజ్ రెండో వివాహం చేసుకున్న‌ప్పుడు, శిల్ప‌ను కొంప‌లు కూల్చే మ‌నిషిగా అభివ‌ర్ణించింది క‌విత‌. రాజ్ త‌న‌కు డైవోర్స్ ఇవ్వ‌డానికి వెనుక ఉన్న ప్ర‌ధాన కార‌ణం శిల్పేన‌ని ఆమె ఆరోపించింది. ఇన్నేళ్లుగా ఈ విష‌యంపై శిల్ప‌, రాజ్‌.. ఇద్ద‌రూ హుందాగా మౌనాన్ని పాటిస్తూ వ‌చ్చారు. అయితే, కొద్ది రోజుల క్రితం శిల్ప‌పై క‌విత చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన పాత వీడియో ఒక‌టి తిరిగి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో రాజ్ మౌనం వీడాడు.

ఒక ఆన్‌లైన్ పోర్ట‌ల్‌తో మాట్లాడిన రాజ్‌, త‌న చెల్లెలి భ‌ర్త‌తో క‌విత వివాహేత‌ర సంబంధం గురించి దిగ్భ్రాంతిక‌ర‌మైన ఆరోప‌ణ‌లు చేశాడు. "నా మాజీ భార్య, మా బావ స‌న్నిహితంగా ఉండ‌గా మా అమ్మ ప‌లుమార్లు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. వారి వ‌ల్ల రెండు కుటుంబాలు విచ్ఛిన్న‌మ‌య్యాయి." అని చెప్పాడు రాజ్‌.

రాజ్ చెల్లెలు రీనా కుంద్రా సైతం త‌న భ‌ర్త త‌న‌ను మోసం చేశాడ‌ని అన్నారు. "క‌విత‌ను నా అక్క‌లాగా చూసేదాన్ని. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను న‌మ్మాను. మేమిద్ద‌రం చాలా క్లోజ్‌. ఆమె నాకు ఇలాంటి ద్రోహం చేస్తుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు. ఆమె చేసిన ప‌నితో నా గుండె బ‌ద్ద‌లైంది." అని చెప్పారు. త‌న భ‌ర్త‌, క‌విత మ‌ధ్య వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ్డాక ఆమె భ‌ర్త నుంచి విడిపోయారు.

11 సంవ‌త్స‌రాల క్రితం విడిపోయాక‌, క‌విత‌తో త‌న డైవోర్స్ వెనుక ఉన్న కార‌ణాన్ని రాజ్ బ‌య‌ట‌పెట్ట‌డం ఇదే మొద‌టిసారి. క‌విత పాత ఇంట‌ర్వ్యూ మ‌ళ్లీ వార్త‌ల్లో నిల‌వ‌డాన్ని శిల్ప ప‌ట్టించుకోలేద‌నీ, త‌నిప్పుడు దాని గురించి ఇంట‌ర్వ్యూ ఇస్తున్న విష‌యం కూడా ఆమెకు తెలీద‌నీ, అయితే చివ‌ర‌కు నిజం బ‌య‌ట‌పెట్టాల‌ని తాను అనుకోవ‌డం వ‌ల్లే ఈ విష‌యాలు చెప్తున్నాన‌నీ అత‌ను తెలిపాడు. 12 సంవ‌త్స‌రాలుగా సంతోష‌క‌ర‌మైన వైవాహిక జీవితాన్ని గ‌డుపుతున్న శిల్ప‌, రాజ్ దంప‌తుల‌కు వియాన్‌, స‌మీషా అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.