English | Telugu

డార్లింగ్ లేడీ కోసం డ్యాన్స్ చేస్తున్న షాహిద్!

డార్లింగ్ లేడీ అన‌గానే ఇంత‌కు ముంద‌యితే ఎవ‌రూ... అంటూ ఆరా తీసేవారు. కానీ ఆదిపురుష్ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచీ కృతిస‌నన్ అంద‌రికీ డార్లింగ్ లేడీగా మారిపోయారు. కృతిస‌న‌న్ హీరోయిన్‌గా, షాహిద్ క‌పూర్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తున్నారు షాహిద్ క‌పూర్‌. హార్ట్ వ‌ర్క్, టాలెంట్ ఉన్న ఇద్ద‌రు న‌టులు స్క్రీన్ మీద ఎంట‌ర్‌టైన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాల‌నుకుంటే ఈ సినిమాను మిస్ కావ‌ద్ద‌ని అంటున్నారు యూనిట్ మెంబ‌ర్స్. ఈ సినిమా కోసం షాహిద్ స్పెష‌ల్‌గా స్టెప్స్ నేర్చుకున్నారు.

ముంబైలో ఈ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ పాట కోసం మాసివ్ సెట్ వేశారు. ఇటీవ‌ల జ‌వాన్‌లో మాసివ్ సెట్స్, మాసివ్ గ్రాండియ‌ర్‌ని చూసిన త‌ర్వాత ఎవ‌రూ త‌గ్గాల‌ని అనుకోవ‌డం లేదు. అందుకే షాహిద్ మూవీ సాంగ్‌కి కూడా మాసివ్ సెట్‌ని వేశారు. ఈ పాట చూసిన వారే కాదు, విన్న వారు కూడా కాలు క‌ద‌ప‌కుండా కూర్చోవ‌డం క‌ష్టం. అంత‌గా ఆక‌ట్టుకునేలా ఉంటుంద‌ట ట్యూన్‌. ఈ పాట‌లో షాహిద్ డ్యాన్స్ మ్యాజిక్‌ని చూసి తీరాల్సిందే అంటున్నారు మేక‌ర్స్. షాహిద్‌, కృతి స‌న‌న్ ఇంత‌కు ముందు క‌లిసి సినిమా చేయ‌లేదు. వారిద్ద‌రూ క‌లిసి చేయ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్‌. మాడోక్ ఫిల్మ్స్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోంది. అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా వాయిదా వేసిన విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ 7న విడుద‌ల చేయ‌నున్నారు ఈ సినిమాను. ధ‌ర్మేంద్ర‌, డింపుల్ క‌పాడియాతో పాటు ప‌లువురు ఈ సినిమాలో న‌టిస్తున్నారు.