Read more!

English | Telugu

బిగ్ బి కి ఇంత తీవ్ర అనారోగ్యం ఉందా!

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇండియాలో నాటికి నేటికి ఎప్పటికీ గుర్తుండిపోయే... ప్రేక్షకులు మర్చిపోలేని సూపర్ స్టార్. సూప‌ర్ స్టార్లు ఎంద‌రు ఉన్నా ఆ బిరుదుకు బిగ్ బిని మించిన వారు లేరు. ఆ బిరుదుకు కెరీర్ మొత్తం న్యాయం చేసిన ఏకైక స్టార్ అమితాబ్‌. ఆయ‌న సినిమాల‌లో న‌టించినా, న‌టించ‌కపోయినా ఆయ‌నే ఇండియ‌న్ సూప‌ర్ స్టార్. ఆజ‌న్మాంతం ఆయ‌నే దానికి స‌రితూగ‌గ‌ల‌రు. ఆయ‌న‌ నటించిన చిత్రాలు అత్యద్భుతమైనవి. షోలే, జంజీర్ నుంచి స‌ర్కార్, బ్ర‌హ్మాస్త్ర  లాంటి చిత్రాలకు నేటి తరంలో ఎవరు న్యాయం చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. కాగా అమితాబచ్చన్ కు కాలేయం 75% పాడైపోయిందట. తనకు క్షయ అంటే టీబీ  వ్యాధి ఉందని.... అది ముదిరింది అన్న విషయం తెలియడానికి ఎనిమిదేళ్లు పట్టిందట. ఈ తీవ్ర అనారోగ్యంతో బాధ ఇబ్బంది పడుతూ తనకు తెలియకుండానే ఇన్నేళ్లు గడిపేసానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

దేశంలో 80% పైగా ప్రజలు ముందస్తు నిర్ధారణ లేకుండానే అనారోగ్యాలను ముద‌ర‌ పెట్టుకుంటున్నారు. రోగనిర్ధార‌ణ  అనేది చికిత్సను సులభతరం చేస్తుంది. ఈ విష‌యంలో మ‌నం ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించాలి. నేను క్ష‌య వ్యాధి నుండి బయటపడిన వ్యక్తిని. హెపటైటిస్ బి సర్వైవర్ అని బహిరంగంగా చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. నా కాలేయం పాడైపోయింది. 20 ఏళ్ల తర్వాత కూడా దాని పర్యవసానాన్ని అప్పుడు గుర్తించగలిగాను. అప్పటికే 70% కాలేయం పాడయింది. నేను ఇప్పటికీ 25% మాత్ర‌మే జీవించి ఉన్నాను అని చెప్పారు.

క్షయ వ్యాధికి పూర్తిగా వైద్యం అందుబాటులో ఉంది. అంతకాలం  నాకు క్ష‌య వ్యాధి చేయవుంద‌ని  తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కాబట్టి మీరు మీరే పరీక్షించుకోవడానికి ఇష్టపడకపోతే అది తప్పిదం. రెగ్యులర్ చెక‌ప్‌ల ద్వారా మాత్రమే రోగాలను కనుగొనగలరు అంటూ చెప్పుకొచ్చారు. 80 ఏళ్ల వయసులో నిత్యం ఉల్లాసంగా గడుపుతున్న అమితాబచ్చన్ జీవితాంతం నటిస్తూనే ఉంటానంటున్నారు. అతను అలుపెరుగని యోధుడిగా కనిపిస్తున్నప్ప‌టికీ  అతడిని  అనారోగ్య సమస్య మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంది.