English | Telugu
ఓటీటీకి వెళ్తున్న జాన్వీ మూవీ!
Updated : Jun 19, 2023
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా బావల్. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ బాట పట్టింది. జులైలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బావల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జాన్వీ కిర్రాక్‌గా ఉన్నారంటున్నారు ఫ్యాన్స్. నితీష్ తివారి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా బావల్. అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా ఇది. వరుణ్, జాన్వీ ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ జోడీగా కనిపిస్తారనడంతో క్రేజ్ తెచ్చుకున్న మూవీ బావల్. ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్‌కే ఫిక్సయ్యారు మేకర్స్. కానీ, ఇప్పుడు సడన్‌గా ఓటీటీలో వచ్చే నెలో విడుదల చేస్తామని ప్రకటించారు.
పోస్టర్‌లో వరుణ్ లుక్స్ కి కూడా ఫిదా అవుతున్నారు జనాలు.జాన్వీ ఇందులో ఎథ్నిక్ ఔట్‌ఫిట్‌లో కనిపిస్తున్నారు. వరుణ్ కేజువల్ లుక్‌లో ఉన్నారు. ప్రతిలవ్‌స్టోరీకి తనదైన బావల్ ఉంటుంది అని క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. సాజిద్ నదియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.దాదాపు 200 దేశాల్లో రిలీజ్ చేయనున్నారు. దీని గురించి నితీష్ తివారి మాట్లాడుతూ ``భారతదేశంలోని మూడు అద్భుతమైన లొకేషన్లలోనూ, ఐదు యూరోపియన్ కంట్రీస్‌లోనూ ఈ సినిమాను తెరకెక్కించాం. అద్భుతమైన కథ ఉంది. డ్రమాటిక్ విజువల్స్ ఉన్నాయి. వరుణ్ ధావన్, జాన్వీ మధ్య అందమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. సరిహద్దులు దాటి సినిమా లవర్స్ ని మెప్పించడానికి ఓటీటీలో విడుదల చేస్తున్నాం. అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. జనాలు మా సినిమా చూసి ఏం చెబుతారో వినాలని ఉత్సాహంగా ఉంది`` అని అన్నారు.