Read more!

English | Telugu

స‌మంత హీరోయిన్‌.. తాప్సీ ప్రొడ్యూస‌ర్‌!

 

త్వ‌ర‌లోనే స‌మంత బాలీవుడ్‌లో అడుగుపెట్ట‌బోతోంది. మీడియా రిపోర్టుల ప్ర‌కారం, తాప్సీ సొంత ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఔట్‌సైడ‌ర్స్ ఫిలిమ్స్ స‌మంత‌తో ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ నిర్మించేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. సౌత్ ఇండియాలోని టాలెంటెడ్ యాక్ల‌ర్ల‌లో స‌మంత ఒక‌రు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌తో దేశ‌వ్యాప్తంగా స‌మంత ఎలాంటి ప‌ర్ఫార్మ‌రో అంద‌రికీ తెలిసింది. ఇప్పుడామె బాలీవుడ్‌లో అడుగుపెట్టాల‌ని ఆశిస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ అనౌన్స్ రానున్న‌ది.

తెలుగులో కె. రాఘ‌వేంద్ర‌రావు రూపొందించిన 'ఝుమ్మంది నాదం' మూవీతో టాలీవుడ్‌లో నాయిక‌గా అడుగుపెట్టిన తాప్సీ, కొన్ని సినిమాల త‌ర్వాత బాలీవుడ్‌కు త‌ర‌లి వెళ్లి, అక్క‌డ పాపుల‌ర్ తార‌ల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది మొద‌ట్లోనే ఔట్‌సైడ‌ర్స్ ఫిలిమ్స్ అనే ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేసింది తాప్సీ.

స‌మంత విష‌యానికి వ‌స్తే, ప్ర‌స్తుతం ఆమె త‌న ప‌ర్స‌న‌ల్ స్టాఫ్‌తో క‌లిసి సౌదీ అరేబియాలో టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన పిక్చ‌ర్స్‌ను త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది. దుబాయ్ ఎక్స్‌పోలో పార్టిసిపేట్ చేయ‌డానికి ఇటీవ‌ల అక్క‌డ‌కు వెళ్లిందామె. ఆమెతో పాటు స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుకాల్క‌ర్‌, మేక‌ప్ ఆర్టిస్ట్ సాధ‌నా సింగ్ కూడా ఉన్నారు.