Read more!

English | Telugu

సోష‌ల్ మీడియా అకౌంట్స్‌ను తొల‌గించిన హ‌జ్బెండ్‌.. రెస్పాండ్ అయిన శిల్పాశెట్టి!

 

శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను డిలీట్ చేశాడు. పోర్న్ మూవీస్ కాంట్ర‌వ‌ర్సీకి ముందు ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే అత‌ను ఇప్పుడు వ‌చ్చిన చెడ్డ‌పేరు వ‌ల్ల‌నో, ఏమో వాటి హ్యాండిల్స్‌ను తొల‌గించేశాడు. జైలు నుంచి విడుద‌లై వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచి సోష‌ల్ మీడియాలో ఆ బిజినెస్‌మ్యాన్ సోష‌ల్ మీడియాకు, జ‌నానికి దూరంగా కాలం గ‌డుపుతున్నాడు. అత‌ను ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌ను డిలీట్ చేసిన కొన్ని గంట‌ల త‌ర్వాత శిల్పాశెట్టి త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మార్పు, భారీ న‌ష్టం గురించి మాట్లాడింది.

త‌ను చ‌దువుతున్న బుక్ నుంచి ఒక పేజీ ఇమేజ్‌ను ఆమె షేర్ చేసింది. అది అల‌న్ అల్డా కొటేష‌న్‌తో మొద‌లైంది. అందులో "మీరు మీ సౌకర్యవంతమైన నగరాన్ని విడిచిపెట్టి, మీ అంతర్ దృష్టి అనే అరణ్యంలోకి వెళ్లాలి. మీరేం క‌నిపెడ‌తారో అది అద్భుతంగా ఉంటుంది. మీరు కనిపెట్టేది మిమ్మ‌ల్నే. మ‌నం సౌల‌భ్యం వైపు ఆక‌ర్షితుల‌మ‌వుతాం. మ‌న జీవితాల గురించి మ‌న‌కు కొన్ని కంప్ల‌యింట్స్ ఉండొచ్చు. విష‌యాలు ప‌ర్ఫెక్టుగా ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ మ‌నం ఎవ‌రిమో, (ఎక్కువో త‌క్కువో) ఎక్క‌డికి వెళ్తున్నామో మ‌న‌కు తెలుసు. దాన్ని మ‌నం ఫీల‌వుతాం. మ‌న కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఏమ‌వుతుంది? మ‌రో దేశంలో ఒక సంవ‌త్స‌రం గ‌డ‌ప‌డం వ‌ల్ల మ‌నల్ని మ‌నం చూసుకోవ‌చ్చు. ఆ ప్ర‌పంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఒక భారీ న‌ష్టం లేదా ఒక పెద్ద మార్పు - మ‌నం ఊహించ‌ని ప్లేస్‌లోకి మ‌న‌ల్ని నెట్టేస్తుంది." అని రాసుంది.

"నా కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, ఏం జ‌రుగుతుందో చూడాలి. మార్పుతో పోరాడ్డానికి బ‌దులుగా దాన్ని నేను స్వీక‌రిస్తాను" అంటూ ఆ పేజీ ముగిసింది.

అశ్లీల వీడియోల‌ను నిర్మించి, వాటిని మొబైల్ యాప్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్న కేసులో రాజ్ కుంద్రా నిందితునిగా ఉన్నాడు. ఒక స్టేట్‌మెంట్‌ను రిలీజ్ చేసిన శిల్పా, త‌న ఫ్యామిలీ ప్రైవ‌సీని గౌర‌వించాల్సిందిగా అంద‌రినీ కోరింది.