English | Telugu
సల్మాన్ వర్సెస్ జాన్ అబ్రహమ్
Updated : Mar 18, 2021
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా వచ్చి ఏడాది దాటేసింది. 2019 క్రిస్మస్ కి విడుదలైన `దబాంగ్ 3` తరువాత తన నుంచి మరో చిత్రం రాలేదు. గత ఏడాది రంజాన్ కి రావాల్సిన `రాధే` కాస్త కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. ఎట్టకేలకు సదరు యాక్షన్ డ్రామా 2021 రంజాన్ స్పెషల్ గా మే 13న రాబోతోంది. `దబాంగ్ 3`ని డైరెక్ట్ ని చేసిన ప్రభుదేవానే `రాధే`కి కూడా దర్శకుడు కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. `రాధే` విడుదలవుతున్న రోజే మరో క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది. ఆ చిత్రమే.. `సత్యమేవ జయతే 2`. 2018 పంద్రాగస్టుకి విడుదలైన `సత్యమేవ జయతే`కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలోనూ జాన్ అబ్రహమ్ కథానాయకుడిగా కొనసాగుతుండగా.. మిలాప్ మిలన్ ఝవేరి దర్శకుడిగా కంటిన్యూ అయ్యారు. ఇందులో జాన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
మరి.. సల్మాన్ ఖాన్ వర్సెస్ జాన్ అబ్రహమ్ అన్నట్లుగా ఉన్న 2021 ఈద్ పోరులో.. ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే మే 13 వరకు వేచిచూడాల్సిందే.