English | Telugu

బాలీవుడ్ `అప‌రిచితుడు`గా ర‌ణ్ వీర్ సింగ్?

సెన్సేష‌నల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ స్థాయిని పెంచిన చిత్రాల్లో `అనియ‌న్` (తెలుగులో `అప‌రిచితుడు`) ఒక‌టి. చియాన్ విక్ర‌మ్ కెరీర్ లో `ది బెస్ట్` మూవీగానూ నిలిచిందీ సినిమా. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ సోష‌ల్ డ్రామా.. హిందీలోనూ `అప‌రిచిత్`గా అనువాద‌మై ఆద‌ర‌ణ పొందింది.

క‌ట్ చేస్తే.. దాదాపు 16 ఏళ్ళ త‌రువాత ఇప్పుడీ సినిమాని హిందీలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ మేర‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు టాక్. అంతేకాదు.. బాలీవుడ్ క్రేజీ స్టార్ ర‌ణ్ వీర్ సింగ్ ని ఈ రీమేక్ లో న‌టింప‌జేసేందుకు ప్లానింగ్ జ‌రుగుతోందట‌. అలాగే.. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ని డైరెక్ట్ చేసిన శంక‌ర్ నే రీమేక్ చేయాల్సిందిగా కోరుతున్న‌ట్లు టాక్. త్వ‌ర‌లోనే `అప‌రిచితుడు` హిందీ రీమేక్ పై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి.. మ‌ల్టి ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ ఉన్న క‌థానాయ‌కుడి పాత్ర‌లో ర‌ణ్ వీర్ ఏ స్థాయిలో మెస్మ‌రైజ్ చేస్తారో చూడాలి.

కాగా, శంక‌ర్ ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ చేసే ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ద్వితీయార్ధంలో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.