Read more!

English | Telugu

బావ బ‌ర్త్‌డే పార్టీకి మాజీ గాళ్‌ఫ్రెండ్‌ని తీసుకు వ‌చ్చిన స‌ల్మాన్‌!

 

స‌ల్మాన్ ఖాన్ మూవీ 'అంతిమ్‌: ద ఫైన‌ల్ ట్రూత్' ద్వారా ఆయ‌న బావ ఆయుష్ శ‌ర్మ (స‌ల్మాన్ చెల్లెలు అర్పిత భ‌ర్త‌) విల‌న్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో నిన్న విడుద‌ల చేశారు. నూత‌న తార మ‌హిమా మ‌క్వానా, డైరెక్ట‌ర్ మ‌హేశ్ మంజ్రేక‌ర్ ఈ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. ఈ ట్రైల‌ర్ స‌ల్మాన్ ఫ్యాన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంద‌ని తెలుస్తోంది.

చాలా కాలం త‌ర్వాత ఈ సినిమాతో థియేట‌ర్ల‌లో త‌మ అభిమాన న‌టుడు రంజింప చేస్తాడ‌ని వారు న‌మ్ముతున్నారు. స‌ల్మాన్ మునుప‌టి మూవీ 'రాధే' నేరుగా ఓటీటీలో రిలీజైన విష‌యం తెలిసిందే. ఆయుష్ శ‌ర్మ బ‌ర్త్‌డేకి ఒక‌రోజు ముందు ఈ ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. దాంతో ఇటు ఆయుష్ బ‌ర్త్‌డే, అటు 'అంతిమ్' ట్రైల‌ర్ లాంచ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఆ త‌ర్వాత ఆయుష్ ఇంట్లో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు.

ఈ బ‌ర్త్‌డే బాష్‌కు స‌ల్మాన్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ నుంచి, క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రితీశ్ దేశ్‌ముఖ్‌, జెనీలియా డిసౌజా దాకా ప‌లువురు హాజ‌ర‌య్యారు. అయితే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది మాత్రం యూలియా వంటూర్‌. ఆమె స‌ల్మాన్‌తో పాటే ఆయన కారులో వ‌చ్చింది. ఫాక్స్ లెద‌ర్ బ్లాక్ స్క‌ర్ట్‌, బ్లాక్ టీ ష‌ర్టులో ఆమె ద‌ర్శ‌న‌మివ్వ‌గా, స‌ల్మాన్ సైతం బ్లాక్ టీ, ఫాక్స్ లెద‌ర్ బ్లాక్ పాంట్స్ ధ‌రించి వున్నాడు. పార్టీకి ఇద్ద‌రూ క‌లిసి రావ‌డం, ఇద్ద‌రూ మ్యాచింగ్ డ్ర‌స్‌తో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో మ‌ళ్లీ ఆ ఇద్ద‌రూ రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారా! అనే అభిప్రాయం అంద‌రిలో క‌లుగుతోంది.

కొన్నాళ్ల క్రితం ఆ ఇద్ద‌రూ రొమాంటిక్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్నార‌ని బాలీవుడ్‌లో చెప్పుకుంటుంటారు. నిజ‌మేంట‌నేది ఆ ఇద్ద‌రికీ, వారి స‌న్నిహితుల‌కూ మాత్ర‌మే తెలుసు.