English | Telugu

'బ్యాట్‌గాళ్' విల‌న్‌గా 'ద మ‌మ్మీ' హీరో!

డీసీ వ‌ర‌ల్డ్‌లో ఫేమ‌స్ అయిన గోథ‌మ్ సిటీకి బ్రెండ‌న్ ఫ్రేజ‌ర్ వెళ్ల‌బోతున్నాడు. య‌స్‌. 'బ్యాట్‌గాళ్' మూవీలో ఆయ‌న విల‌న్‌గా న‌టించ‌నున్నాడు. ఆయ‌న విల‌న్ ఫైర్‌ఫ్లై క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాడు. 'బ్యాట్‌గాళ్‌'గా టైటిల్ రోల్‌ను లెస్లీ గ్రేస్ పోషించే ఈ మూవీకి బ్యాడ్ బాయ్స్ ఫ‌ర్ లైఫ్ ఫేమ్ ఆదిల్ ఎల్ ఆర్బీ, బిలాల్ ఫ‌లా ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ‌ర్డ్స్ ఆఫ్ ప్రే ఫేమ్ క్రిస్టినా హాడ్స‌న్ స్క్రిప్ట్ స‌మ‌కూరుస్తున్నారు.

గోథ‌మ్ పోలీస్ క‌మిష‌న‌ర్ జిమ్ గార్డ‌న్ కూతురు బార్బ‌రా గార్డ‌న్ చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంది. జాక్ స్నైడ‌ర్ జ‌స్టిస్ లీగ్‌లో జిమ్ గార్డ‌న్‌గా న‌టించిన జె.కె. సిమ‌న్స్ ఈ సినిమాలో అదే క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. 2022లో హెచ్‌బీవో మాక్స్‌లో 'బ్యాట్‌గాళ్' రిలీజ్ అవుతుంద‌ని అంచ‌నా.

1990ల‌లో వ‌చ్చిన‌ 'ద మ‌మ్మీ' సినిమాల్లో హీరోగా బ్రెండ‌న్ ఫ్రేజ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాతులు, అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. టీవీ సిరీస్ 'డూమ్ పెట్రోల్‌'లో న‌టించ‌డం ద్వారా ఇప్ప‌టికే డీసీ వ‌ర‌ల్డ్‌లోకి అడుగుపెట్టిన ఆయ‌న‌, ఇప్పుడు బ్యాట్‌గాళ్‌లో మెయిన్ విల‌న్ రోల్‌ను సంపాదించాడు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.