English | Telugu
రూ. 249కే జీప్లెక్స్‌లో సల్మాన్ 'రాధే'!
Updated : Apr 27, 2021
సల్మాన్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' ఈ రంజాన్‌కు వివిధ ఫార్మటల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఏప్రిల్ 22న విడుదల చేసిన ట్రైలర్‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని ప్లాట్‌ఫామ్స్ కలిపి ఈ ట్రైలర్‌కు 65 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన "సీటీమార్" సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాటతో సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది.
పలు ఫార్మట్లలో ఇండియా నుంచి రిలీజ్ అవుతున్న ఫస్ట్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్‌గా 'రాధే' నిలుస్తోంది. 40 దేశాల్లో థియేటర్లలో విడుదలవుతున్న ఈ మూవీ అన్ని ప్రముఖ డీటీహెచ్ ఆపరేటర్లలో.. డిష్, డీ2హెచ్, టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలతో పాటు జీ స్టూడియోస్‌కు చెందిన పే-పర్-వ్యూ ప్లాట్‌ఫామ్ జీప్లెక్స్‌లోనూ విడుదలవుతోంది.
ఫస్ట్ డే ఫస్ట్ షోను సౌకర్యంగా ఇంట్లో కూర్చొని కుటుంబమంతా కలిసి చూడ్డానికి జీప్లెక్స్ ఏర్పాట్లు చేస్తోంది. సల్మాన్ నటించగా ప్రభుదేవా డైరెక్ట్ చేసిన 'రాధే'ను కేవలం రూ. 249 పెట్టి జీప్లెక్స్‌లో మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను త్వరలో అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఓపెన్ చేయనున్నారు.
సల్మాన్ జోడీగా దిశా పటాని నటించిన ఈ మూవీలో రణదీప్ హూడా విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో జాకీ ష్రాఫ్ నటించారు. మే 13న ఈ సినిమా విడుదలవుతోంది.