English | Telugu

ఓ మై గాడ్‌2 టీజ‌ర్ విడుద‌ల‌

అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ నటించిన సినిమా ఓ మై గాడ్ 2. 2023లో రిలీజ్ అయ్యే సినిమాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న సినిమాల్లో ఓ మై గాడ్ 2 కూడా ఒకటి. అమిత్ రాయ్‌ డైరెక్ట్ చేశారు. అక్షయ్‌, ప‌రేష్ రావ‌ల్‌, యామి గౌతమ్ నటించిన హిట్ సినిమా ఓ మై గాడ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. 2012లో రిలీజ్ అయింది ఓ మై గాడ్‌. దాదాపు 10 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోంది ఓ మై గాడ్ సీక్వెల్.

ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది టీమ్‌. ఇప్పుడు టీజర్ రూపంలో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో అక్షయ్ శివుడి అవతారంగా కనిపించనున్నారు. ఆయన లుక్స్ నుంచి ప్రతిదీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప‌రేష్‌ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది టీజర్. అక్షయ్, పరేష్ సంబంధించిన కొన్ని స్టిల్స్ ఇందులో కనిపిస్తాయి. ఈ వీడియోలో పంకజ్‌, ఆయన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చూపించారు . అక్షయ్ వాళ్ల జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా సాగుతుంది. టీజర్ లో యామి గౌతమ్ ని మిస్ చేశారు మేకర్స్. సోషల్ కామెడీగా తెరికెక్కుతోంది ఈ సినిమా. డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ తో పర్ఫెక్ట్ బ్లెండ్ అనిపిస్తోంది. ఈ టీజర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. క్యా బాత్ హే, మైండ్ బ్లోయింగ్ టీజర్ హర హర మహాదేవ అంటూ రాసుకొస్తున్నారు నెటిజన్లు. `ఓ మై గాడ్ 2 టీజర్ రిలీజ్ అయింది హర హర మహాదేవ్‌` అని ఇంకొక రాశారు.

టైగ‌ర్ ష్రాఫ్ అయితే ఏకంగా అక్ష‌య్‌ని ప్రశంసల్లో ముంచేశారు. `గురూజీ....` అంటూ ఫైర్ హార్ట్ ఎమోజితో తన స్పందన తెలియజేశారు.ఓ మై గాడ్ 2 ఆగస్టు 11న విడుదల కానుంది. ఇదే రోజు విడుదలవుతోంది సన్నిడియోల్, అమీషా పటేల్ నటించిన గద‌ర్ 2. సీక్వెల్స్ మధ్య పోటీ విపరీతంగా ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్ష‌కులు. రెండు వేర్వేరు జాన‌ర్లు కాబట్టి, దేని ప్రేక్షకులు దానికి ఉంటారని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మేకర్స్ లో.