Read more!

English | Telugu

సైఫ్‌కు రూ. 5 వేల కోట్ల ఆస్తులున్నాయి.. కానీ వాటిలో పిల్ల‌ల‌కు చిల్లిగ‌వ్వ ఇవ్వ‌లేడు!

 

అవును. ఇది నిజ‌మే. భార‌త్‌లోని అతి సంప‌న్న‌వంత‌మైన కుటుంబాల్లో ఒక‌దాని నుంచి వ‌చ్చాడు బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సైఫ్ అలీఖాన్‌. అత‌నిది రాజ‌వంశం. అత‌ను మ‌న్సూర్ అలీఖాన్ ప‌టౌడీ అలియాస్‌ టైగ‌ర్ ప‌టౌడీ కుమారాడు. హ‌ర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌, భోపాల్‌లోని పూర్వీకుల ఆస్తుల విలువ క‌లిపితే ఏకంగా రూ. 5 వేల కోట్లు! కానీ ఆశ్చ‌ర్య‌పరిచే విష‌యం ఏమంటే, ఆ ఆస్తుల్లో చిల్లిగ‌వ్వ కూడా త‌న పిల్ల‌లు సారా అలీఖాన్‌, ఇబ్ర‌హీం అలీఖాన్‌, తైమూర్ అలీఖాన్‌, జ‌హంగీర్ అలీఖాన్‌ల‌లో ఎవ‌రికీ ఇవ్వ‌లేడు. ఎందుకంటారా! 

హౌస్ ఆఫ్ ప‌టౌడీ ఆస్తుల‌న్నీ భార‌త ప్ర‌భుత్వ‌పు వివాదాస్ప‌ద ఎనిమీ డిస్‌ప్యూట్స్ యాక్ట్ కింద‌కు వ‌స్తాయి. ఆ చ‌ట్ట ప‌రిధిలోకి వ‌చ్చే అలాంటి ఆస్తి లేదా సంప‌ద‌ల‌కు వార‌సులుగా ఎవ‌రూ క్లెయిమ్ చెయ్య‌లేరు. ఒక వ్య‌క్తి లేదా వ్య‌క్తులు ఎనిమీ డిస్‌ప్యూట్స్ యాక్ట్‌ను స‌వాలు చేసి, ఏదైనా ఆస్తి త‌మ‌దేన‌ని భావించి క్లెయిమ్ చెయ్యాల‌నుకుంటే, వారు హైకోర్టును ఆశ్ర‌యించాల్సి ఉంటుంది. అక్క‌డ విఫ‌ల‌మైతే, ఆ కేసు సుప్రీంకోర్టుకు, ఆ పైన రాష్ట్ర‌ప‌తి ద‌గ్గ‌ర‌కు చేరుతుంది.

సైఫ్ ఆస్తుల వ్య‌వ‌హారం ఎంత గంద‌ర‌గోళంగా ఉందంటే, బ్రిటీష్ పాల‌న‌లో న‌వాబుగా ఉన్న‌ అత‌ని ముత్తాత హ‌మీదుల్లా ఖాన్‌, త‌న ఆస్తుల‌పై ఎన్న‌డూ వీలునామా రాయ‌లేదు. వాటిపై కుటుంబం లోప‌ల, ప్ర‌త్యేకించి పాకిస్తాన్‌లోని సైఫ్ తాత‌య్య సోద‌రి వార‌సుల‌తో ఉన్న వివాదం దీనికి కార‌ణ‌మ‌ని అంటుంటారు. చాలా సంక్లిష్ట‌మైన ఈ విష‌యాల‌న‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే హ‌ర్యానా, భోపాల్‌లో ఉన్న త‌న పూర్వీకుల ఆస్తుల‌ను మొద‌టి భార్య అమృతా సింగ్ పిల్ల‌ల‌కు కానీ, రెండో భార్య క‌రీనా క‌పూర్ పిల్ల‌ల‌కు కానీ బ‌దిలీ చేయ‌లేని స్థితిలో ఉన్నాడు సైఫ్ అలీఖాన్‌.