English | Telugu
సిద్ధార్థ్ ఆనంద్ నయా మూవీ డీటైల్స్
Updated : Jul 14, 2023
ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ల లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది సిద్ధార్థ్ ఆనంద్ నేమ్. ఈ ఏడాది ఆల్రెడీ పఠాన్‌తో సక్సెస్ కొట్టి, భారతదేశంలో ఉన్న ఐదు వెయ్యి కోట్ల సినిమాల్లో ప్లేస్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ జంటగా ఫైటర్ తెరకెక్కిస్తున్నారు. సల్మాన్, షారుఖ్ తో టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాకు పచ్చ జండా ఊపారు. అంతే కాకుండా షారుఖ్‌ఖాన్, సుహానా ఖాన్, టైగర్ ష్రాఫ్ నటించే రాంబో సినిమాను కూడా డైరక్ట్ చేయబోతున్నారు. ఇన్నిటి మధ్య ఓటీటీ కోసం ఓ ప్రాజెక్టును చేయబోతున్నారు. సైఫ్ అలీఖాన్ నటించిన మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సైఫ్‌తో ఆయన చేసిన సినిమాను నెట్‌ఫ్లిక్స్ 60 కోట్లకు కొనుగోలు చేసింది. మార్‌ఫ్లిక్స్ ప్రొడక్షన్... నెట్‌ఫ్లిక్స్‌తో గొప్ప ఒప్పందం చేసుకున్నట్టు వినికిడి. “అతి తక్కువ వ్యవధిలో వార్, పఠాన్‌లను రిలీజ్ చేసిన తర్వాత డిమాండ్ ఉన్న డైరక్టర్‌గా మారిపోయారు సిద్ధార్థ్ ఆనంద్. తాను సిల్వర్ స్క్రీన్ మీద చేయాలనుకుని చేయలేకపోయిన కథలతో యాక్షన్ మూవీస్ తెరకెక్కించి డిజిటల్ రిలీజ్ చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు సిద్ధార్థ్. ఇందులో భాగంగానే సైఫ్‌తో మూవీ చేశారు. ఇంకా పేరు కూడా పెట్టని ఆ సినిమాను నెట్‌ఫ్లిక్స్ 60 కోట్లకు కొనుగోలు చేసింది`` అని అంటున్నారు అతని సన్నిహితులు.
సైఫ్ అలీ ఖాన్ స్టైల్‌కి పూర్తి భిన్నంగా తెరకెక్కింది ఈ మూవీ. మిషన్-ఓరియెంటెడ్ యాక్షన్ జోనర్‌లో ఉంటుంది. “సిద్, రాబీకి మంచి అనుబంధం ఉంటుంది. వారిద్దరూ కథా చర్చల్లో మరింత లోతులకు వెళ్తుంటారు. అలా రాబీ చెప్పిన పాయింట్ నచ్చి ఈ మూవీ చేశారు`` అని అన్నారు సైఫ్. మరియు రాబీ చాలా దూరం వెళ్లి సినిమాలకు మించిన బంధాన్ని పంచుకుంటారు. ఇది మార్ఫ్లిక్స్ సలామ్ నమస్తే, తర రమ్ పమ్ తర్వాత సైఫ్ అలీ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కలిసి పనిచేసిన మూవీ ఇది. ల కలయికను సూచిస్తుంది, అయితే ఈసారి నిర్మాత మరియు నటుడి హోదాలో ఉంది. త్వరలో మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.