English | Telugu

ఐదు సిటీల‌ను విజిట్ చేయ‌నున్న ఆలియా!

క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఏడో సినిమా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హాని. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ నటించారు. ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ కీ రోల్స్ చేశారు. విడుద‌ల‌కు ఇంకా రెండు వారాల స‌మ‌యం ఉంది. జూలై 28న థియేటర్లలో విడుదల కానుంది రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీ. ఈ రామ్-కామ్‌ని ఎంతో శ్ర‌ద్ధ‌గా తెర‌కెక్కించారు డైర‌క్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్‌. దాదాపు 7 సంవత్సరాల తర్వాత కరణ్ జోహార్ దర్శకుడిగా మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టిన మూవీ ఇది. రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ ట్రైలర్, పాటల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాను ఐదు మేజ‌ర్ సిటీల్లో ప్ర‌మోట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఈ మేర‌కు టూర్‌కి మొత్తం ప్లానింగ్ కంప్లీట్ అయింది. సోమవారం నుంచి, అంటే జూలై 17 నుంచి ఈ ప‌ర్య‌ట‌న మొద‌ల‌వుతుంది.

డైర‌క్ట‌ర్‌, హీరో, హీరోయిన్ ఈ ట్రిప్పులో ఉంటారు. ఈ ప్రచారం బరోడాలో ప్రారంభమవుతుంది. ఇది దాదాపు 10 రోజుల పాటు కొనసాగుతుంది. రణవీర్-ఆలియా క‌లిసి త‌మ రామ్ కామ్‌ని ప‌బ్లిక్‌లోకి తీసుకెళ్లాల‌నే దృఢ నిశ్చ‌యంతో ఉన్నారు. ఈ ప్రమోషనల్ టూర్‌లో వారు అభిమానులతో ఇంటరాక్ట్ అవుతారు. కొన్ని సిటీస్‌లో మూవీలో యూజ్ చేసిన మేజ‌ర్ ప్రాప‌ర్టీస్‌ని రివీల్ చేస్తారు. ఎలాంటి సినిమానైనా ప‌ర్ఫెక్ట్ థియేట్రిక‌ల్ రిలీజ్ చేసి, హండ్రెడ్ ప‌ర్సెంట్ సక్సెస్ సాధిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది క‌ర‌ణ్ జోహార్ మీద‌. ఆయ‌న రికార్డ్ ట్రాక్ అలాంటిది మ‌రి. ప‌రిశ్ర‌మ‌లో 25 ఏళ్లుగా ఎన్నెన్నో మార్పుల‌ను చూశారు క‌ర‌ణ్‌. నార్త్ లో ఆయ‌న‌కూ, ఆయ‌న సినిమాల‌కూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంటూనే ఉంటుంది. అది ఇప్పుడు రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ క‌హానీకి కూడా హెల్ప్ అవుతుంద‌ని అంటున్నారు విమ‌ర్శ‌కులు.