Read more!

English | Telugu

ప‌దో రోజు హిందీ 'ఆర్ఆర్ఆర్‌'కు అదిరిపోయే వ‌సూళ్లు!

 

రాజ‌మౌళి మాగ్న‌మ్ ఓప‌స్ 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్ష‌న్ క‌లెక్ష‌న్లు బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. రీసెంట్‌గా ప్రాంతీయ భాషా సినిమాల గురించి చుల‌క‌న‌గా మాట్లాడిన జాన్ అబ్ర‌హాం లేటెస్ట్ ఫిల్మ్ అటాక్‌కు 'ఆర్ఆర్ఆర్' దెబ్బ మామూలుగా త‌గ‌ల్లేదు. హిందీ బెల్ట్‌లోని ఆడియెన్స్ జాన్ కామెంట్స్‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా త‌మ అభిమాన సినిమా 'ఆర్ఆర్ఆర్' అని తేల్చి చెబుతున్నారు. విడుద‌లైన ప‌దో రోజు 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్ష‌న్‌కు రూ. 20.50 కోట్ల నెట్ క‌లెక్ష‌న్ రావ‌డంతో జాన్ దిమ్మ తిరిగిన‌ట్ల‌యింది. శుక్ర‌వారం విడుద‌లైన అత‌ని సినిమా 'అటాక్‌'కు ఆదివారం రూ. 4 కోట్ల పై చిలుకు క‌లెక్ష‌న్ మాత్ర‌మే వ‌చ్చింది.

ప‌ది రోజుల‌కు 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్ష‌న్ వ‌సూళ్లు రూ. 184.59 కోట్ల‌కు చేరుకున్నాయి. రెండో వారంలో శుక్ర‌వారం రూ. 13.50 కోట్లు, శ‌నివారం రూ. 18 కోట్లు, ఆదివారం రూ. 20.50 కోట్ల‌ను 'ఆర్ఆర్ఆర్' రాబ‌ట్టింది. మార్చిలో విడుద‌లైన హిందీ సినిమాల్లో 'ద క‌శ్మీర్ ఫైల్స్' త‌ర్వాత రూ. 200 కోట్ల మార్కును అందుకోనున్న సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నిల‌వ‌నుంది. ఈరోజుతో అది ఆ మార్కును అందుకోవ‌చ్చున‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. 

ఇటు రామ్‌చ‌ర‌ణ్‌కు, అటు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు హిందీలో ఇదే తొలి రూ. 200 కోట్ల సినిమాగా నిల‌వ‌నున్న‌ది. ఆ ఇద్ద‌రి హిందీ మార్కెట్ పెర‌గ‌డం వారి త‌దుప‌రి సినిమాల‌కు క‌లిసి వ‌స్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టికే తెలుగు 'ఆర్ఆర్ఆర్' రూ. 200 కోట్ల షేర్ మార్కును దాటి, ఆ ఫీట్ సాధించిన వారి ఫ‌స్ట్ ఫిల్మ్‌గా నిలిచింది.