Read more!

English | Telugu

రూ. 190 కోట్ల మార్కును దాటిన హిందీ RRR

 

రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన RRR మూవీ హిందీ వెర్ష‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపుతోంది. దాని దెబ్బ‌కు డైరెక్ట్ హిందీ సినిమాలు కుదేల‌వుతున్నాయి. మార్చి 25న విడుద‌లైన ఈ సినిమా 11 రోజుల‌కు రూ. 191.59 కోట్ల (నెట్‌)ను రాబ‌ట్టి, రూ. 200 కోట్ల క్ల‌బ్బులో చేర‌డానికి ఉర‌క‌లు వేస్తోంది. సోమ‌వారం 11వ రోజు RRR హిందీ రూ. 7 కోట్ల‌ను రాబ‌ట్టింది. 

రెండో వారంలో ఈ సినిమాకు శుక్ర‌వారం రూ. 13.50 కోట్లు, శ‌నివారం రూ. 18 కోట్లు, ఆదివారం రూ. 20.50 కోట్లు వ‌చ్చాయి. మంగ‌ళ‌వారంతో ఈ సినిమా అక్ష‌య్‌కుమార్ 'సూర్య‌వంశీ' లైఫ్‌టైమ్ క‌లెక్ష‌న్ల‌ను దాటేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 'సూర్య‌వంశీ' రూ. 196 కోట్ల‌ను వ‌సూలు చేసింది. అలాగే బుధ‌వారంతో RRR క‌లెక్ష‌న్లు రూ. 200 కోట్ల మార్కును అందుకునే అవ‌కాశం ఉంది. 

ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో 'ద క‌శ్మీర్ ఫైల్స్' ఇప్ప‌టివ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా రూ. 245 కోట్ల (నెట్‌)ను వ‌సూలు చేసి ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌గా, RRR రెండో స్థానంలో ఉంది. ఏప్రిల్ 1న విడుద‌లైన జాన్ అబ్ర‌హాం ఫిల్మ్ 'అటాక్' పార్ట్ 1 నాలుగు రోజుల‌కు కేవ‌లం రూ. 11.51 కోట్ల‌ను మాత్ర‌మే వ‌సూలు చేసి డిజాస్ట‌ర్‌గా నిలిచింది.