Read more!

English | Telugu

13 రోజుల్లో 200 కోట్లు.. హిందీలో 'RRR' రికార్డు

హిందీలో 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. తాజాగా రూ.200 కోట్ల నెట్ మార్క్ ని క్రాస్ చేసి సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ దూకుడు చూస్తుంటే త్వరలోనే 250 కోట్ల మార్క్ ని దాటి 300 కోట్లకు చేరువయ్యేలా ఉంది.

మొదటి వారం హిందీలో 133.07 కోట్ల నెట్ రాబట్టి సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ రెండో వారంలోనూ దూకుడు కొనసాగిస్తోంది. రెండో వారంలో ఈ సినిమాకు శుక్ర‌వారం రూ.13.50 కోట్లు, శ‌నివారం రూ.18 కోట్లు, ఆదివారం రూ.20.75 కోట్లు, సోమవారం 7 కోట్ల, మంగళవారం 6.50 కోట్ల రాగా.. 13 వ రోజు అయిన బుధవారం 5.50 కోట్ల వచ్చాయి. దీంతో ఆర్ఆర్ఆర్ 13 రోజుల్లో 204.25 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అలాగే గురువారం మరో 5-6 కోట్ల నెట్ రాబట్టి రెండు వారాలు ముగిసేసరికి 210 కోట్ల నెట్ సాధించే అవకాశముంది.

ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో 'ద క‌శ్మీర్ ఫైల్స్' ఇప్ప‌టివ‌ర‌కూ రూ. 245 కోట్లకు పైగా నెట్ వ‌సూలు చేసి మొదటి స్థానంలో ఉండ‌గా, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో ఉంది. మూడో వారంలో క‌శ్మీర్ ఫైల్స్ ని దాటేసి మొదటి స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.