English | Telugu

తాజా ల‌వ‌ర్ల‌తో క‌లిసి గోవాలో మాజీ భార్యాభ‌ర్త‌లు హృతిక్‌, సుజానే పార్టీ!

చాలా కాలం క్రిత‌మే హృతిక్ రోష‌న్‌, సుజానే ఖాన్ భార్యాభ‌ర్త‌లుగా విడిపోయారు. ఇద్ద‌రూ వేరేవాళ్ల‌తో రెండోసారి ప్రేమ‌లో ప‌డ్డారు. యువ‌న‌టి స‌బా అజాద్‌తో హృతిక్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు రాగా, న‌టుడు అర్‌స్లాన్ గోనీతో సుజానే చెట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతోంది. రెండు రోజుల క్రితం స‌బా చేతిని ప‌ట్టుకొని ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ క‌నిపించాడు హృతిక్‌. అదే రోజు సుజానే, గోనీ కూడా అదే ఎయిర్‌పోర్టులో జంట‌గా ద‌ర్శ‌న‌మిచ్చారు. గోవాలో ఆ రెండు జంట‌లు పార్టీ చేసుకున్న ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

లేటెస్ట్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫొటో అయితే అంద‌రికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. హృతిక్‌, సుజానే ఇద్ద‌రూ త‌మ తాజా ల‌వ‌ర్ల‌తో క‌లిసి ఒకే ఫ్రేమ్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆ పిక్చ‌ర్‌లో స‌బా న‌డుం చుట్టూ చేయివేసి హృతిక్ పోజివ్వ‌గా, స‌బా ప‌క్క‌న నిల్చున్న సుజానే త‌న బాయ్‌ఫ్రెండ్ గోనీ భుజం మీద చేయివేసి పోజిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోను స్వ‌యంగా షేర్ చేసింది సుజానే. పార్టీకి సంబంధించిన కొన్ని మూమెంట్స్‌తో రీల్ చేసిన ఆమె, తాము న‌లుగురూ క‌లిసి పోజిచ్చిన ఫొటోను షేర్ చేసింది.

కాగా.. త‌మ రిలేష‌న్‌షిప్ గురించి హృతిక్‌, స‌బా ఇద్ద‌రూ బ‌హిరంగంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి వ్యాఖ్యాలూ చేయ‌లేదు. అయితే జంట‌గా క‌లిసి తిరుగుతూ కెమెరాల‌కు దొరికిపోతున్నారు.