English | Telugu
ఓటీటీలో అవన్నీ ఉండాలంటున్న రణ్‌వీర్‌సింగ్
Updated : Aug 4, 2023
రణవీర్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ ని ఊరిస్తున్నాయి. రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ సినిమా గురించి ఆయన హాట్ అప్డేట్ ఇచ్చారు. ఆల్రెడీ థియేటర్లో విడుదలైన వెర్షన్లో కొన్ని సీన్లను డిలీట్ చేశారని చెప్పారు. నిడివిని దృష్టిలో పెట్టుకుని డిలీట్ చేసిన ఆ సన్నివేశాలను ఓటీటీలో కలపాలని రిక్వెస్టు చేశారు. కరణ్‌జోహార్ డైరక్ట్ చేసిన సినిమా ఇది. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్,ఆలియా జంటగా నటించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. రిలేషన్షిప్స్, రొమాన్సుల గురించి మంచి సినిమా చేశారంటూ చాలా మంది మెచ్చుకుంటున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇటీవల ముంబైలో సినిమా టీమ్ అంతా సక్సెస్ సెలబ్రేట్చేసుకుంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు టీమ్ మెంబర్స్.
ఈ సందర్భంగా రణ్వీర్ మాట్లాడారు. సినిమా స్క్రీన్ మీద నిడివిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసిన విధానం బాధ కలిగించిందని చెప్పారు. రణ్వీర్ మాట్లాడుతూ ``ఒరిజినల్‌గా ఈ సినిమా మూడు గంటలా పది నిమిషాల పాటు ఉంది. కానీ,కరణ్ జోహార్, ఆయన ఎడిటింగ్ టీమ్ మొత్తం లేపేశారు. దాదాపు 22 నిమిషాలకు కత్తెర వేశారు. ప్రేమ ఉంటే అంతా ఉన్నట్టే అని రాకీ వెళ్లి రాణీతో చెప్పే సీన్ ఎడిట్‌లో పోయింది. అలాగే మరికొన్ని హిలేరియస్ సన్నివేశాలు ఎడిటింగ్‌లో వెళ్లిపోయాయి. వాటన్నిటిని ఇప్పుడు ఓటీటీలో యాడ్ చేయమని అడుగుతున్నాను`` అని అన్నారు. దానికి కరణ్ జోహార్ చూద్దాం అని సమాధానం ఇచ్చారు. ఇందులో ఆలియా భట్ ఇండిపెండెంట్ జర్నలిస్టుగా నటించారు. ధర్మేంద్ర, జయాబచ్చన్ కీ రోల్స్ చేశారు.