English | Telugu
మళ్లీ షారుఖ్‌ని గొడవలోకి లాగిన కాజోల్
Updated : Aug 4, 2023
కాజోల్ ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడినా నార్త్ లో ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి. అలాంటిది మళ్లీ ఇప్పుడు మరొకటి చోటుచేసుకుంది. కాజోల్ ఇటీవల న్యూఢిల్లీలో జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ఆమె పే పారిటీ గురించి మాట్లాడారు. పఠాన్ సినిమా సక్సెస్ గురించి మాత్రమే కాదు, షారుఖ్ సినిమాల్లో పే పారిటీ గురించి ప్రస్తావించారు. ఇదే విషయం మీద ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్, కృతి సనన్ కూడా చాలా సార్లు తమ అభిప్రాయాలను చెప్పారు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో కాజోల్‌కి ఎదురైంది. ఈ ప్రశ్న ఆమెకు ఎదురవ్వగానే కాసేపు సమాధానం చెప్పకుండా తటపటాయించారు కాజోల్. ఎప్పటిలాగా నవ్వుతూ నిలుచున్నారు.
కానీ, మళ్లీ మళ్లీ అడగడంతో జ్యోతిష్కుడిని అడగండి అంటూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. కాసేపు తర్వాత మాట్లాడుతూ ``ఇండియా కోసం వండర్ విమెన్‌ని సిద్ధం చేసేటప్పుడు అది పఠాన్ అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. పే ఈక్వాలిటీ విషయంలోనూ ``అని అన్నారు. ఇండస్ట్రీలో పురుషులకు ఇచ్చే విలువ, స్త్రీలకు కూడా ఇచ్చినప్పుడు పే ఈక్వాలిటీ వస్తుంది అని చెప్పారు. అప్పటిదాకా ఈ సమస్య ఇలాగే ఉంటుందని వెల్లడించారు. పఠాన్‌నీ, షారుఖ్‌ని తన ప్రస్తావనలోకి తీసుకురావడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా షారుఖ్ గురించి మాట్లాడారు కాజోల్. ``నాకు షారుఖ్ కనిపిస్తే వెంటనే పఠాన్ ఒరిజినల్‌గా ఎంత కలెక్ట్ చేసింది. ఎంత బిజినెస్ జరిగిందో చెప్పమని అడుగుతాను`` అని అన్నారు. కాజోల్ ఇటీవల లస్ట్ స్టోరీస్2లో నటించారు. ట్రయల్‌లోనూ ఆమె కోస్టార్‌ని కిస్ చేసిన విధానం వైరల్ అవుతోంది.
