English | Telugu
కింగ్ ఖాన్‌తో రష్మిక.. అసలు విషయమిదే!
Updated : Aug 5, 2023
శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న ఓ వైపు సౌత్ సినిమాలతో పాటు నార్త్ మూవీ ఇండస్ట్రీపై కూడా కన్నేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘రెయిన్ బో’ అనే మూవీ చేస్తోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇది కాకుండా పాన్ ఇండియా మూవీ పుష్ప 2లోనూ నటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌తో కలిసి నటించింది. అదేంటి ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా కింగ్ ఖాన్‌తో రష్మిక నటించిందా? ఎప్పుడు.. ఎక్కడ.. ఏ సినిమాలో? అనే సందేహం రావచ్చు. కానీ వారిద్దరరూ నటించింది సినిమాలో కాదు.. యాడ్‌లో. యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో ఈ కమర్షియల్ యాడ్‌ను చిత్రీకరించారు. దానికి సంబంధించిన క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ సదరు వాణిజ్య ప్రకటన ఏంటనేది తెలుసుకోవాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే ఆమె రెయిన్ బో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక రణ్‌భీర్ కపూర్‌తో కలిసి నటించిన యానిమల్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీ డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది. ఇవి కాకుండా షాహిద్ కపూర్‌తో ఓ సినిమాలో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న యానిమల్, తెరకెక్కుతోన్న పుష్ప 2 సినిమాలపైనే రష్మిక భారీగా ఆశలను పెట్టుకుంది. ఈ మూవీస్ హిట్ అయితే ఆమెకు మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తోంది.
ఇప్పటికే ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. మరి రానున్న సినిమాలు ఎలాంటి ఫలితాలనిస్తాయో తెలియాలంటే వెయిటింగ్ తప్పదు మరి.
