English | Telugu
ఆమె నా ఫస్ట్ క్రష్.. సీక్రెట్ చెప్పేసిన రణ్‌వీర్!
Updated : Jul 22, 2023
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్సింగ్ తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన సీక్రెట్‌ను ఓపెన్‌గా చెప్పేశారు. అది కూడా స్టేజ్‌పై స్టూడెంట్స్ ముందు. కొందరు దీనిపై ఆశ్చర్యపోయారు. కొందరేమో నవ్వుకున్నారు. ఇంతకీ అంతలా అందరినీ తనవైపు తిప్పుకునే చేసిన రణ్వీర్‌కు సంబంధించిన సీక్రెట్ ఏంటో తెలుసా!..ఫస్ట్ క్రష్ గురించి. ఈ సీక్రెట్‌ను రణ్‌వీర్ఓపెన్‌గా చెప్పటానికి ముందు అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే, రణ్‌వీర్సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ`. జూలై 28న ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధమవుతోంది...
ప్రస్తుతం ఎంటైర్ `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ` యూనిట్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా ఉంది. అందులో భాగంగా టీమ్ స్టూడెంట్స్‌తో మాట్లాడారు. ఆ స్జేజ్‌పై రణ్‌వీర్సింగ్‌తో పాటు అలియా భట్, కరణ్ జోహార్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా మీ టీచర్‌తో క్రష్‌లో పడ్డారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి కరణ్ జోహార్, అలియా భట్ అలాంటి పరిస్థితి ఎదురు కాలేదంటూ సమాధానం ప్లకార్డుల రూపంలో ఇచ్చారు. అయితే రణ్‌వీర్మాత్రం తాను క్రష్‌లో పడ్డానని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోవటంతో పాటు నవ్వుకున్నారు.
"నేను మొదటి తరగతిలో ఉన్నప్పుడు బాంద్రాలోని లెర్నర్స్ అకాడమీలోని టీచర్ మిస్ మెల్‌రోస్ మెక్‌గిల్‌తో క్రష్ ఏర్పడింది. మీరు ఇప్పుడు ఇది చూస్తుంటారని అనుకుంటున్నాను. ఇప్పటికీ నా గుండెలో మీకు ప్రత్యేకమైన స్థానం ఉంది."అని తన ఫస్ట్ క్రష్ గురించిన వివరాలను కూడా రణ్‌వీర్స్టేజ్‌పై ఓపెన్‌గా చెప్పటం కొస మెరుపు.
వయాకామ్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' సినిమాను కరణ్ జోహార్ డైరెక్ట్ చేశారు. జూలై 28న రిలీజ్ కానుంది. రణ్‌వీర్సింగ్, అలియా భట్ నాయకా నాయికలుగా నటించారు.