English | Telugu

మాజీ ల‌వ‌ర్ లుక్‌పై దిశా ప‌టాని కామెంట్స్‌

తెలుగు సినిమా `లోఫ‌ర్‌`తో కెరీర్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టాని బాలీవుడ్‌లో సెటిలైంది. అక్క‌డ గ్లామ‌ర‌స్ పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. బాలీవుడ్‌లో హీరోయిన్స్ ప్రేమాయ‌ణాల‌ను న‌డ‌ప‌టంలో ఎప్పుడూ ముందుంటారు. అంద‌రి బాటలోనే త‌ను అంటూ అమ్మ‌డు టైగ‌ర్ ష్రాఫ్‌తో ప్రేమ పాఠాల‌ను నేర్చుకుంది. ఇద్ద‌రూ క‌లిసి సినిమాల్లోనూ ఆడిపాడారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చాయి. బ్రేక‌ప్ చెప్పేసుకుని ఎవ‌రి దారుల్లో వాళ్లు వెళ్లిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో టైగ‌ర్ ష్రాఫ్‌ను ఉద్దేశించి దిశా ప‌టాని చేసిన లేటెస్ట్ కామెంట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

సాధార‌ణంగా బ్రేక‌ప్ అయినప్పుడు ఒక‌రి గురించి ఒక‌రు మాట్లాడుకోరు. ఎడ‌మొహం, పెడ‌మోహంగా ఉంటారు. ఒక‌రికొక‌రు ఎదురు ప‌డినా ముఖం చిట్లించుకుని వెళ్లిపోవ‌టాన్ని ఇంత‌కు ముందు ప్రేమికుల్లో మ‌నం గ‌మ‌నించి ఉండొచ్చు. కానీ దిశా ప‌టాని మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన ల‌వ్ ట్రాక్ ఒక‌టి రిలీజైంది. అందులో టైగ‌ర్ లుక్ పై ఆయ‌న స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు, ఫ్యాన్స్ నెట్టింట సూప‌ర్ అంటూ రియాక్ట్ అయ్యారు. అయితే టైగ‌ర్ మాజీ ల‌వ‌ర్‌ దిశా ప‌టాని చేసిన కామెంట్స్ మాత్రం అంద‌రినీ ఆక‌ర్షించాయి. నీ లుక్ , వాయిస్ చాలా బావున్నాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో దిశాప‌టాని చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. టైగ‌ర్ ష్రాఫ్‌తో ఈ ల‌వ్ ట్రాక్‌లో జ‌ర‌హ్ ఎస్‌.ఖాన్ న‌టించింది.

ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ `క‌ల్కి 2898 ఏడీ`లో దిశా ప‌టాని న‌టించింది. అయితే రీసెంట్‌గా వ‌చ్చిన ఈ మూవీ గ్లింప్స్‌లో దిశా ప‌టాని లుక్ ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని మేక‌ర్స్ రివీల్ చేయలేదు. టాలీవుడ్ స్టార్‌తో దిశా ప‌టాని న‌టించిన రెండో సినిమా ఇదే. అలాగే ఈ హాట్ బ్యూటీ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే కావ‌టం విశేషం.