English | Telugu
రణ్ వీర్ - ఆలియా.. `ప్రేమ్ కహానీ`?
Updated : Jun 4, 2021
జోయా అఖ్తర్ రూపొందించిన మ్యూజికల్ డ్రామా `గల్లీ బాయ్` (2019)లో జోడీగా నటించి అలరించారు రణ్ వీర్ సింగ్, ఆలియా భట్. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం ఈ ఇద్దరు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి `ప్రేమ్ కహానీ` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. అంతేకాదు.. రణ్ వీర్, ఆలియా పాత్రలను చాలా చక్కగా డిజైన్ చేశారని బాలీవుడ్ బజ్. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కదిద్దుకున్నాక.. ఈ లవ్ స్టోరీ సెట్స్ పైకి వెళ్ళనుందట. మరి.. `గల్లీ బాయ్` తరహాలో ఈ సినిమాతోనూ రణ్ వీర్ - ఆలియా జంట బ్లాక్ బస్టర్ అందుకుంటుందేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం ఆలియా చేతిలో `గంగూబాయి కతియావాడి`, `ఆర్ ఆర్ ఆర్`, `బ్రహ్మాస్త్ర` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక రణ్ వీర్ విషయానికి వస్తే.. `83`, `సూర్యవంశీ` చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. `జయేష్ భాయ్ జోర్దార్` పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండగా.. `సర్కస్` చిత్రీకరణ దశలో ఉంది.