English | Telugu

రాజమౌళి కాళ్లు మొక్కిన బాలీవుడ్ స్టార్ రణ్‌ బీర్‌

ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలితో ఆయన తన ప్రతిభను ప్రపంచానికి చూపించడమే కాకుండా.. తెలుగు సినిమా స్థాయిని పెంచారు. అసలు ఇప్పుడు ఇన్ని పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయంటే దానికి బీజం వేసింది రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలినే. అందుకే బాలీవుడ్ సైతం రాజమౌళికి సలాం కొడుతోంది. తాజాగా జరిగిన 'బ్రహ్మాస్త్ర' మూవీ ప్రెస్ మీట్ లో బాలీవుడ్ రాజమౌళిని ఎంతలా అభిమానిస్తుందో మరోసారి తేలిపోయింది.

Also Read:పుష్ప‌.. అంచ‌నాల‌ను మించి ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టిన హిందీ వెర్ష‌న్‌!

రణ్‌ బీర్‌ కపూర్‌, ఆలియా భట్ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సౌత్ లో రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. శనివారం హైదరాబాద్ లో రాజమౌళితో కలిసి బ్రహ్మాస్త్ర మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రణ్‌ బీర్‌, ఆలియా, అయాన్‌, కరణ్ జోహార్ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశారు.

Also Read:అత్తగారింట్లో 'కత్రినా' వండిన తొలి వంటకం ఏంటో తెలుసా?

రణ్‌ బీర్‌ వేదిక పైకి రాగానే రాజమౌళి కాళ్లకి దణ్ణం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాకుండా, ఇండియాలోనే కాదు టోటల్ వరల్డ్ లోనే ప్రజెంట్ నా ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి అని రణ్‌ బీర్‌ చెప్పాడు. ఇక డైరెక్టర్ అయాన్ మాట్లాడుతూ.. 'ఇండియన్ సినిమాలో నెంబర్ 1 పేరు.. రాజమౌళి' అని అన్నాడు.

Also Read:'పుష్ప' మూవీ రివ్యూ

ఆలియా మాట్లాడుతూ రాజమౌళికి అయాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని తెలిపింది. 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదలైన రోజు ఆయన ఆర్ఆర్ఆర్ ఫీవర్ లో ఉండి, వర్క్ కూడా చేయలేదని చెప్పుకొచ్చింది. ఇక కరణ్ మాట్లాడుతూ.. రాజమౌళి సినిమా బౌండరీస్ ని చెరిపేశారని.. ఇప్పుడు మనం పాన్ ఇండియా, ఇండియన్ సినిమా అంటున్నాం అంటే దానికి రాజమౌళినే కారణమని అన్నారు. రాజమౌళి ప్రతి సినిమా తాను చూసి ఎంజాయ్ చేస్తానని, అలాంటి మాస్టర్ జీనియస్ ఇండియన్ సినిమాకి అవసరమని కరణ్ ప్రశంసించారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.